Saturday 3 December 2016

ఆ ఏభై లక్షలకూ లెక్కచెప్పమంటే సరి

రేవంత్ రెడ్డి తో పంపిన ఆ ఏభైలక్షలకూ లెక్క చెప్పమని
ఆదాయపు పన్ను శాఖ బాబుగార్ని ఎందుకు అడగదు

Friday 2 December 2016

మోడీది తుగ్లక్ పాలన : టిడిపి


ప్రజల మద్దతుతో నల్ల ధనం పై యుద్ధం ప్రకటించిన మోడీది తుగ్లక్ పాలనట
ఇది చెప్పే ముందు
లక్షలాది ఎకరాలు లాక్కుంటూ
జనాల గొంతు నొక్కుతూ
ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చని
తమది ఏ పాలనో బొండా గారు సెలవిస్తారా

"అంధజ్యోతి" సర్వే సూపర్

 నోట్ల రద్దు మా నాయకుడి చలవేనని ప్రగల్బాలు  పలికిన ఎల్లోస్ డర్టీ ఫెల్లోస్
ఆనక నాయకుడితో సహా అసహనం వెళ్లగక్కుతూ ఉంటే
నోట్ల రద్దు కమిటీ ఛైర్మెన్ గా నియమించిన మోడీగారు
మొన్న వచ్చిన అంధ జ్యోతి సర్వే లో బీజేపీతో కలవకపోతే మనకే ఎక్కువ సీట్లు వస్తాయని
చెప్పిస్తే ఏ పోస్టు ఇవ్వాలో మరి

Saturday 19 November 2016

నల్లధనం నోట్లరూపంలో ఉంటుందా ? మీరే చెప్పండి .....

చాన్నాళ్లుగా అనేకమంది అవినీతి జలగలపై అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. వారందరి ఇళ్లలో బినామీ స్థలాలు, ఇళ్ళు , బంగారం లాంటివి కోట్లలో పట్టు పడితే నగదు కేవలం లక్షల్లో , చాలా సార్లు వేలలో మాత్రమే దొరికేది...
అంతెందుకు మొన్నీ మధ్య హతమైన నయీమ్ వద్దకూడా నగదు రూపంలో పట్టుపడింది చాలా తక్కువ ..
ఇది 1-2 శాతాలకు మించదు...
మరో ముఖ్యమైన విషయం -
ఒక కోటి రూపాయలు వెయ్యి నోట్లతో దాయాలంటే 10,000 నోట్లు కావాలి అంటే 100 కట్టలు కావాలి .. దీనిని  భద్రపరచడానికి చాలా స్థలం కావాలి . అదే బంగారంగా మారిస్తే 4 కేజీలు అవుతుంది . అంటే చిన్న పెట్టిలో పెట్టొచ్చు. అలాగే నోట్లు భద్రపరిస్తే చెదలు పట్టొచ్చు , కాగితాలు  పాడైపోవచ్చు.
మరి అలాంటప్పుడు నోట్ల రూపంలో నల్ల ధనం ఉండే అవకాశం ఉందా ?
మీరే చెప్పండి

Tuesday 15 November 2016

ఈయన దగ్గర అసలు నోట్లే లేవట


పెద్ద నోట్లు రద్దుచేయమని ఏనాడో చెప్పిన ఈయన
అప్పటికే సింగపూరుకు, స్విస్ బ్యాంకుకు  సరుకుని తరలించారని
జనాలు చెవులు కొరుక్కున్నా
అనుచర డర్టీ ఫెల్లోస్ తమకి మాట మాత్రం చెప్పలేదని ఫీల్ అవుతున్నారట
ఢీ  అంటే ఢీ అనేవాడే మోడీ అని తెలియని వీళ్లు
తమ నాయకుడి అసలు బండా(గా)రం ఎక్కడ బయట పడుతుందో అని
కంగారు పడుతున్నారట

Saturday 12 November 2016

బాబుగారు తిప్పుతున్న మరో చక్రం- ఆంధ్రాలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయట

ఆంధ్రాలో విచ్చలవిడిగా చేర్చుకున్న నేతలకు
సీట్లు సర్దడానికి అసెంబ్లీ స్థానాలను 225 కి పెంచె పనిలో ఉన్నారట
ఎక్కడెక్కడ ఎయె స్థానాలు కావాలో ఇప్పటికే లిస్టు వెళ్లిపోయిందట
ఇక శీతాకాల సమావేశాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు.





Tuesday 25 October 2016

ఒక రాష్ట్రాన్ని ఎన్ని హబ్ లు గా మారుస్తారు ? : అందరూ చదవండి

ఏపీని "స్పోర్ట్స్ హబ్' గా మారుస్తాం  - గంటా (http://6tvlive.com/6tv-telugu-news-8907.html)

విశాఖను సినీ హబ్ గా మారుస్తాం: చంద్రబాబు (http://netiap.com/featured/visakhapatnam-will-change-as-the-hub-of-the-film-industary-chandrababu-naidu.html)

విశాఖను ఐటి హబ్ గా మారుస్తాం- పల్లె రఘునాథ్ రెడ్డి (http://www.netiap.com/featured/we-will-collect-huge-investment-in-it-electronics-palle-raghunath-reddy.html)

హిందూపురంను ఐటీ హబ్ గా మారుస్తాం – బాలకృష్ణ (http://www.netiap.com/featured/will-make-hindhupuram-as-it-hud-says-balakrishna.html)

ఏపీని విమానయాన హబ్ గా మారుస్తాం: సీఎం చంద్రబాబు (http://www.ap7am.com/flash-news-553269-telugu.html)

తిరుపతిని మెడికల్ హబ్ గ మారుస్తాం - చదలవాడ (http://www.expresstv.in/medical-hub-as-tirupathi-49932.aspx)

కడపను హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం - చంద్రబాబు (http://leadertimes.org/newsdetails/2589/%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%B9%E0%B0%AC%E0%B1%8D%E2%80%8C%E0%B0%97%E0%B0%BE%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82)

రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా మారుస్తాం: గంటా (http://www.andhrajyothy.com/artical?SID=103490&SupID=31)





50% పెరిగిన కరెంటు చార్జీలు?

ఈ నెల మొదట్లో
అందరికీ క్రొత్త మీటర్లు తప్పని సరి అని చెప్పి
బిగించి వెళ్లారు
చూద్దును కదా
వారానికి ఏడు యూనిట్లు నడిచే పాత మీటర్ స్థానే
గత వారంలో 10 యూనిట్లు నడిచింది
ఈ లెక్కన కరెంటు బిల్లు 50% పెరగనుందా  ?

ప్రజలపై దండయాత్ర కార్యక్రమం

దోమలపై దండయాత్ర
ప్రతిపక్షాలపై దండయాత్ర
చీమలపై దండయాత్ర ..
త్వరలో ప్రజలపై దండయాత్ర అట
కానీ
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై మాత్రం దండయాత్ర లేదు

Thursday 13 October 2016

ఈయనగానీ ప్రధాని ఐతేనా ...

కేంద్రం గుట్టుగా ఉంచిన నల్లధనం వెల్లడి వివరాలను తెలుసుకున్నారు
అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లో హిల్లరీకి మద్దతు పలికారు
ఐదొందల, వెయ్యినోట్ల రద్దు కోరారు
ఈయనగానీ ప్రధాని ఐతేనా ...

రేపటి యువతకు మార్గదర్సులు

 నాడు ఓటుకు నోటులో దొరికి
నేడు అవినీతిపై స్వచ్ఛ్ యుద్ధం పాటిస్తున్న తండ్రితో పాటూ
నాడు సత్యం డబ్బులతో చదివి
ఆడవాళ్ళతో జల్సాలు చేసినా రేపు ఆయనే యువతకు మార్గదర్శి

Monday 12 September 2016

ప్యాకేజీ వల్ల ఇన్ని లాభాలు !

రైతు రుణమాఫీలకు
డ్యాఖ్రా రుణమాఫీలకు
నిరుద్యోగులకు నెల నెలా భృతికి
ఇంకా ఎన్నో ఎన్నికల హామీలు తీర్చడానికి
ప్యాకేజీ ఉపయోగ పడుతుంటే
అరిచి గీ  పెట్టడం భావ్యమా ?

ప్రత్యేక హోదా వల్ల తీవ్ర నష్టం అర్ధం అయింది

 పదేళ్లు కావాలని పార్లమెంటులో అరిచి గీపెట్టినప్పుడు వెంకయ్యనాయుడికి అర్ధం కాలేదు ...
పది కాదు పదిహేనేళ్ళు కావాలని ఎన్నికల సభల్లో వక్కాళించినప్పుడూ
ఢిల్లీ చుట్టూ 24 సార్లు తిరిగినప్పుడూ
  బాబుకు అర్ధం కాలేదు ...
ఆంధ్రకు హోదా ఇవ్వడానికి వీల్లేదని గీపెట్టిన 13 రాష్ట్రాల సీఎంకూ అర్ధం కాలేదు
ఇప్పుడు ఒకేసారి తెలిసింది
ఈ ముగ్గురికీ - వెంకయ్యకు , బాబుకు , సుజనా కు
"ప్రత్యేక హోదా " వల్ల నష్టమేనని..
ప్యాకేజీ ముద్దు అని

Sunday 11 September 2016

బీజేపీతో పాటూ తానూ మునుగుతానని ...

నాడు కాగ్రెస్ ను ముంచి
మామను వెన్నిపోటుపొడిచి
ప్రజలను మభ్యపెట్టి పీడించిన బాబును నమ్మి
మళ్ళీ ఓట్లేసిన పాపానికి
ప్రజలతో పాటూ
బీజేపీని ముంచడానికీ రెడీ
తనకు తెలీదు బీజేపీతో  పాటూ తానూ మునుగుతానని

Saturday 10 September 2016

నాడు కాంగ్రెస్ కు పట్టిన గతి రేపు టిడిపికి


రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అమ్మేశారు
నోట్లకి కొంత
ఓట్లకి కొంత
కాళ్ళక్రింద దూరే బానిసత్వానికి అంతా!!

ఆత్మ గౌరవం లేదు
ఆవకాయ పచ్చడి లేదు
నరంలేని నాయకులుంటే రాష్ట్రం నాశనమే!!

రక్తం మరిగిందని
ఇరవై సార్లు వెళ్ళి కలిశానని
ప్రత్యేకహోదా మాత్రమే కావాలని ప్రజలతో వంతపాడి
ఇచ్చినంతా తీసుకోక ఎంచేద్దామన్నప్పుడే
నీ మేక తోలు ఊడిపొయింది!!

చేతకాకపోతే దిగిపోవచ్చు
చేతనైతే ఎదుర్కొనవచ్చు
రెండిటికీ కాక
చేష్టలుడిగిన నీ మేకపోతు గాంభీర్యం
మమ్మల్ని పగలబడి నవ్వేలా చేస్తూంది!!

విభజన పై ఇచ్చిన ప్రజా తీర్పులో
ఒక రాజకీయవర్గం మాడి మసైపోయింది
కేంద్రం భజన చేస్తూ వారి తొత్తులామారిన
మీ వర్గం మరో తీర్పుతో దిగంతాలకేగుతుంది!!


రాష్ట్రమేమైనా పర్లేదు
నా కుర్చీ ఉండాలి
నేను క్షేమంగా ఉండాలనే
నీ ఆశయం ప్రజలపై రుద్దకు
ఎందుకంటే నిన్ను ప్రజలు రేవుకేస్తారు
ప్రతేకహోదా సబ్బుతో ఉతుకుతారు !!

సోర్స్ : http://ochinnamaata.blogspot.in/2016/09/blog-post_10.html

Friday 9 September 2016

అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు పట్ల స్పీకర్ అసంతృప్తి

ప్రతిపక్షానికి ప్రజా సమస్యలు పట్టవా ?
జగన్ పై కేసులు అందుకే ఇలా ఎదురుదాడి
వైకాపా బాధ్యత గల ప్రతిపక్షం కాదు ..
ఇవీ  మంత్రుల పలుకులు ...
చూద్దాం .. వచ్చే ఎన్నికల్లో తాము ప్రతిపక్షంలో కూర్చుని
ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో నేర్పిస్తారు కదా ?


Thursday 8 September 2016

పవన్ కళ్ళు తెరవాలి .. ఆయన ఒక వ్యక్తి కాదని గుర్తెరగాలి

చాలామందే ఉద్యమాలు చేస్తే రాణి హోదా తనతో వస్తుందా అని నిర్లిప్తత వద్దు
మీరు ఒక వ్యక్తి కాదు
మీరు ఒక శక్తి అని తెలుసుకోండి
మీరు తలచుకుంటే ప్రభుత్వాలు కూలడం , తారుమారు కావడం సాధ్యమే
రేపటి కాకినాడ సభ దానికి నాంది కావాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం కావాలి

ఆంధ్రజ్యోతికి, చంద్రబాబుకీ ప్యాకేజీనే ఎందుకు ముద్దు ?

పేరుకే ఆంధ్రజ్యోతి .. చెప్పేవన్నీ అంధకార నీతులే
అర్ధరాత్రి దాకా హై  డ్రామా నడిపి
చంద్రబాబుతో నిరంతరం చర్చిస్తున్న కేంద్రం అంటూ ఊదరగొట్టి
అరాకొరా ప్రాకేజీకి ఒప్పుకొని
దాన్నే పెద్దదిగా , గొప్పదిగా చేస్తున్న
ఆంధ్రజ్యోతిది ఇంతపెద్ద దగా
నోరుమెదపలేని బాబుది ఇంతపెద్ద మోసం


Sunday 4 September 2016

పచ్చపలుకులు : ఏపీకి సూపర్ ప్యాకేజీ అట


ఇవీ ఈనాడు , ఆంధ్రజ్యోతి లోని హెడ్ లైన్లు
పచ్చపార్టీలోని కార్పొరేట్లకు హోదా  కన్నా ప్యాకేజీయే ముద్దు
హోదా ఇస్తే వచ్చే పరిశ్రమలు తమకు పోటీ అవుతాయని
హోదా ఇస్తే తమ స్థలాలు ఉన్న అమరావతికన్నా రాయలసీమ , కోస్తాలు అభివృద్ధి చెందుతాయని
హోదా ఇస్తే బీజేపీకి మంచిపేరొస్తుందని
ప్యాకేజీ ఐతే పంపకానికి ఈజీగా ఉంటుందని
ప్యాకేజీ మంచిదని నమ్మించేలా ఎల్లో మీడియా ముందే చిందులు



‘Stay’BN

ఇప్పటికి 18 కేసుల్లో స్టేలు
మచ్చలేని నాయకుడు
ఎవరికీ భయపడడం ఎరుగని నేత
...
అందుకే
నిజమైన నాయకుడంటే ఈయన !

Wednesday 31 August 2016

'సాక్షి' పేపరోళ్లకు సాక్ష్యాలేదొరకవా ?

అటు రుణమాఫీ చేశామని ధీమాగా ప్రభుత్వం చెపుతుంటే ...
అటు పట్టిసీమలో అవినీతి జరగలేదని హుందాగా అంటూంటే ...
రాజధానిలో అక్రమాలే లేవని బాకా ఊడుతుంటే ...
బాబు భయపడడం కల అని బల్ల గుద్ది హెచ్చరిస్తూంటే ...

తాము చెప్పిన వాటికి, రాసిన రాతలకు ఆధారాలు చూపలేని
సాక్షి పేపర్ ఎందుకు దండగ !
రుణమాఫీ జరగని ప్రజలతో మీటింగ్ పెట్టొచ్చుగా ...
అక్రమాలు ఆధారాలతో నిరూపించొచ్చు కదా !

ఓటుకు నోటు కేసులో బాబుగారు నిర్దోషి

మచ్చలేని చంద్రునికి మచ్చపెట్టాలని ప్రతిపక్షాల కుట్ర
ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి
ఇది సోమిరెడ్డి ఉవాచ !
మరి ఫోన్ లో గొంతెవరిదో ...
హైదరాబాద్  నుంచి ఆదరాబాదరా పయనమెందుకో ...
ట్యాపింగ్ కేసెందుకు పెట్టారో ...
ఎవరు చెప్తారట ?

Friday 12 August 2016

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున జగన్ ని పుష్కరాల ఆహ్వానం

ఇంటింటికీ వెళ్లి చిన్నా చితకా నటులకు  కూడా పదిరోజుల ముందే ఇన్విటేషన్లు
ఒకరోజు గడిచాక ప్రతిపక్షనాయకుడికి ఈరోజు !
అబ్బెబ్బే ఇది అవమానించడం కాదు
మీరే అవమాన పడడం అని తెలుసుకోండి
శిశుపాలుని పాపాలు లెక్కిస్తున్నట్లు
జనం మీ పాపాలు లెక్కిస్తున్నారని మర్చిపోకండి !!
మీరు మారఋ ... కనీసం మారినట్లు నటించండి !!!


Saturday 6 August 2016

రాష్ట్రపతి పలకరింపూ ప్రచారాస్త్రమే

రాష్ట్రపతిని కలిస్తే -
అందరూ మీలా పని చేస్తే చాలు
దేశం అభివృద్ధిలో దూసుకు వెళుతుంది
అని చంద్ర బాబు తో అన్నారంట!

పాపం ఆ పెద్దాయన వెటకారంగా
అందరూ మీలా "పార్టీలను చీల్చితే" , "ప్రతిపక్షాల గొంతు నొక్కితే" చాలు
"తెలుగుదేశం"  అభివృద్ధిలో
దేశం అవినీతిలో దూసుకు వెళుతుంది
అని ఉండవచ్చు


Sunday 31 July 2016

మన బాబుగారైతే బందు ఇలా చేస్తారు

బందులంటే షాపులు మూయడం కాదు
బందంటే బస్సులు ఆపడం కాదు
బందంటే రోడ్లమీదకు రావడం కాదు
బందంటే పని చేయక పోవడం కాదు
మరి బందంటే
మరింత ఎక్కువగా పనిచేయడం
షాపులు మరింత ఎక్కువగా తెరిచి ఉంచడం
బస్సులు మరిన్ని తిప్పడం
రోడ్లు ఊడ్చడం
డ్రైనేజీలు క్లీన్ చేయడం
మొక్కలు నాటడం
మరి మన బాబుగారైతే బందు ఇలానే చేస్తారట !
ఇంతకూ ముందు చూసాం ఎలాచేసారో !
ఇకముందూ చూస్తాం ఎలా చేస్తారో !!

Friday 29 July 2016

అర్థం చేసుకొనే పరిణితి ప్రజలకు వుంది

తన లేఖతో విభజించారని
బిల్లు ఆమోదమైన వెంటనే సెహబాష్ అంటూ
ఐదు లక్షల కోట్లు కావాలని పలికి
ఆనక
 హోదాతో ఒరిగేదేం లేదంటూ ..
అంతకన్నా ఎక్కువ కావాలని
కేంద్రం అవన్నీ లెక్కలడగకూడదు అంటూ
హోదా ఇస్తే మోడీ ఖాతాలోకి పోతుందని ...
పోలవరం కడితే కేంద్రానికే పేరొస్తుందని
వఛ్చిన డబ్బు తన ఖాతా అభివృద్ధితో చూపిస్తూ
పట్టిసీమ , మెట్టసీమల పంపులతో పేరు కొట్టేద్దామని
మనసులో ఉన్నా
రాజ్యసభలో కాసింత హడావిడి చెయ్యకపోతే
జనం ఛీకొడతారని అనుకున్నా
తాము ఏంచేస్తున్నామో
అర్థం చేసుకొనే పరిణితి ప్రజలకు వుంది

Wednesday 27 July 2016

బీజేపీని ముంచాలనే ప్రత్యేకహోదా వద్దన్నారా ?

నిజానికి ప్రత్యేక హోదాకు బీజేపీ కట్టుబడినా
హోదా ఇస్తే దానివల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని
తన గుర్తింపు రాదనీ
ఆ వెసులుబాట్లు కరెంటు, ఇతర సౌకార్యాల రూపంలో పొందుతూ
అభివృద్ధిలో తనకు మాత్రమే పేరు వచ్చేలా
వ్యవహరిస్తున్న బాబుగారి
ఉచ్చులో పడితే బీజేపీ చిక్కుల్లో పడడం ఖాయం !

Tuesday 26 July 2016

టిడిపిలో మంత్రి కామినేని

కామినేని వారూ ..
నేడు తెలుగుదేశం కార్యకర్తల సమావేశాలకు మీరు వెళితే
రేపు బీజేపీ కార్యకర్తలకు ఏం సందేశమిస్తారు ?


 1c6a4042-1050-47b1-ae41-c2c4373a7492

Tuesday 19 July 2016

సింగపుర్ కంపెనీలు చంద్రబాబుతో మాత్రమే సంప్రదింపులు జరిపితే ?

తమ తమ సీక్రెట్ ఎజెండాలతో
కేవలం బాబుని మాత్రమే నమ్ముకుని
రాజధానిలో పాగాకు ప్రయత్నిస్తే
వచ్ఛే ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం ఖాయం !
ఇప్పటికైనా తెలుసుకుని కనీసం తామైనా
పారదర్శకంగా వ్యవహరించి
కేంద్రం , ప్రతిపక్షపార్టీలతో చర్చిస్తే మేలు !
ఇది ఒక ఏడాదో , రెండేళ్లో సాగే వ్యవహారం కాదు
2050 వరకూ మీ ఆధిపత్యానికి అనుమతి కదా ?

Wednesday 13 July 2016

మోడీగారి సర్వేలో బాబుగారికి 13వ ర్యాంక్

మొన్న NCAER సర్వేలో ఆంధ్రకు  మొదటి స్థానం ఇస్తే
 ( లింక్ : http://www.ndtv.com/india-news/gujarat-delhi-most-investment-friendly-contradictory-to-bihar-jharkhand-1426540 )

నేడు మోడీగారు పదమూడో ర్యాంక్ ఎలా ఇస్తారని
తెలీని సాధారణ కార్యకర్తలు
మొన్న మొదటి ర్యాంకు అవినీతికి అనీ
నేటి పదమూడో ర్యాంక్ పనితనానికి అనీ
గమనించి ...
నాలిక్కర్చుకున్నారుట !

బాబు కళ్లకు గంతలు

ఆనాడు బందర్ పోర్టుకు ఐదు వేల ఎకరాలు ఎందుకు అన్నారు
నేడేమో లక్ష ఎకరాలు చాలవంటున్నారు !
ఆనాడు రైతు రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకమన్నారు
నేడు వడ్డీల వాయిదాలు చెల్లిస్తున్నారు !
ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు పందికొక్కులు అన్నారు
నేడు వారినే నెత్తికి ఎక్కించుకుంటున్నారు !
నాడు చేదైనవి ఈ రోజు మిఠాయిలు అయ్యాయా ?
నాటి తీపి కబుర్లు నేడు నీటిపై రాతలయ్యాయా ?
ఇలా ప్రజలను  ఇబ్బందులకు గురిచేసి
వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి
ఆగ్రహానికి గురయ్యే సలహాలు
బాబుకు ఎవరిస్తున్నారో పాపం

Thursday 7 July 2016

ఎన్నిసార్లు ప్రారంభించినా తప్పు లేదు

కాంట్రాక్టర్లకు బోనస్ ఇప్పించడానికి 
ఆదరా బాదరా ఎక్కడినుంచో మోటార్లు తెఛ్చి బిగించి 
ఆ ప్రారంభోత్సవంలో 
జల క్రీడలు ఆడినా తప్పులేదు
పుష్కరాలు దగ్గర పడుతుండడంతో 
ఇంకా పూర్తేకాని కాలువను కాసేపు తడపడానికి 
ప్రారంభించినా తప్పు లేదు 
మరెన్నో సార్లు ప్రతీమైలు రాయి 
కాలవ తవ్వకంలో ,
గ్రామ గ్రామాన ప్రారంభించినా తప్పులేదు 
పట్టిసీమ ఉట్టిసీమ అయిపోకూడదు మరి

Wednesday 6 July 2016

"కృష్ణాగోదావరి" నది

తుంగభద్రా పెన్నానదుల అనుసంధానమైన కేసీ కెనాల్
కృష్ణా పెన్నాలను కలిపిన తెలుగు గంగా
లను మించి
ఆనాడు రాజశేఖర్ రెడ్డి తవ్విన 120 కిలోమీటర్ల
పోలవరం కుడి కాలువలోకి
పంపుల ద్వారా నీరు తోడి
పవిత్ర కృష్ణ కోదావరి నదులను
కలిపేందుకు పూనుకున్న
మన ప్రభుత్వం ఎంత గొప్పదో కదా !
ఆ ఉత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళూ చాలవేమో !!
13600048_1250942278291640_8942982499334238231_n
13620710_1250942808291587_41386086054009137_n

ఈ మాత్రం "కాపీ" కే అంత రాద్దాంతమా ?!

ఎమ్మెల్యేలను లాగు "కొనడం"లోనూ
హరితహారం లోనూ
జీతాల పెంపులోనూ
చార్జీల పెంపులోనూ
ప్రతిపక్షాలను అణచివేయడంలోనూ
పత్రికల గొంతు నొక్కడంలోనూ
టీవీ చానళ్ల నిషేదంలోనూ
కాపీ కొడితే అడగని వాళ్ళు
ఇప్పుడు
ఒక చిన్న వెబ్సైట్ కాపీ కొట్టిందని
ఎందుకు గొంతు చించుకోవడం ?



Tuesday 5 July 2016

కృష్టా పుష్కరాలకు గోదావరిలో మునకలు

క్రిష్ణా
గోదావరి
నదులు రెండిటికీ
ఒకే సారి వరదలు వస్తాయి అన్నారు కదా !
ఇప్పుడు చూడండి గోదారికి వరద వచ్చినా
కృష్ణలో  ప్రవాహమే లేదు ..
మేం చేపట్టిన పట్టిసీమ సార్ధకం అయింది
ఆ రెండు పంపుల నీళ్లూ కృష్ణలో పోస్తాం
కృష్టా పుష్కరాలకు గోదావరిలో మునకలేయిస్తాం
 

గృహస్థాశ్రమం గురువులు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా ఏమి చేయాలట ?

ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు అంటూ 
రాష్ట్ర ప్రభుత్వం నియమించినా
తాను ఏమి చేయాలో బోధపడలేదో
లేక హిందూ ధర్మ విధ్వంసంలో
పాలు  పంచుకోడానికి విముఖుడయ్యో
చాగంటివారు  ఇంకా కేంద్ర ప్రభుత్వ సర్వీసు లోనే
నిచ్చింతగా ఉన్నారట !
13614930_1209397815789742_6068374747374606692_n

Monday 4 July 2016

గడప గడపకి ఎటాచ్మెంట్లు

గడప గడపకీ
నూరు ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్
తీసుకువెళ్లే చేతులతోనే
ఎటాచ్ చేసిన ఆస్తుల జాబితా
కేసుల పూర్వాపరాల చిట్టా
మొత్తం ఆస్తుల లిష్టూ
కూడా తీసుకువెళ్ళండి

దేవతల్లారా కొండల్లోకి పారిపోండి


శేషాచలం
శబరిమల
శ్రీశైలం
సింహాచలం
అహోబిలం
అమర్నాథ్
వైష్ణొదేవి
తిరుత్తణి
హొరనాడు
శృంగేరి
మూకాంభికా
కనక డదుర్గమ్మ
భధ్రాచలం
పానకాల స్వామి
ఇలాంటి కొండ కోనలు
ఎంచుకోవాలి దేవతలు
తమ ఆవాసాలుగా!
శబ్దకాలుష్యం
మంత్రోచ్ఛారణల శబ్ద , దుమ్ము ధూళి కాలుష్యాలు సృషించే
మీరు మాకు పట్టణాల్లో వద్దు
పట్టణాలపై అధికారం 
మాదే
మీ గుడుల  ముందు బిచ్చ్చమెత్తుకునే మారిని
మీకోసం పరితపించేవారిని
మీపై భక్తి పారవశ్యంతో పరవసిస్తున్నవారిని
మీరే తీసుకుపోండి
మేం మాత్రం
వంద  కార్లు ఒకేసారి దూసుకుపోయే రోడ్లేసుకుంటాం
బిచ్చగాళ్ళేలేని  సమాజాన్ని సృష్టిస్తాం
మా పట్టణాన్ని దేవుడు లేని నగరంగా
సుందరీకరణ చేస్తాం
రోడ్లకు రెండు వైపులా
బార్లూ , మాల్ లూ , ఐమేక్స్ లూ  కట్టేస్తాం
మీరు మాత్రం కొండల్లోనే ఉండండేం ..
ఏదో ఏడాదికి ఓసారి తీరిక దొరికితే ఓ ప్రయాణం వేసుకుంటాం
మీరు మాకు రోజూ కనపడ్డానికీ , మీ మంత్రోచ్ఛారణలు వినపడ్డానికీ లేదు

 

Thursday 30 June 2016

నరసింహ వ్యాఖ్యానం

విశ్లేషకుడు  నరసింహారావు ఉండగా
ఆ చర్చలకు టిడిపి పార్టీవారు ఎందుకట ?
ఇలాంటి పార్టీలకు కొమ్ముకాసే విశ్లేషకుడు
టీవీలకు ఎందుకట ?
ఉద్యోగులు చచ్చినట్లు అమరావతికి రావాలట
జగన్ కి సిగ్గుంటే జనంలో కనపడకూడదట
అయినా
ఓటుకి నోటు కేసులో దొరికిన బాబు గారు భేష్ ఆట


స్పందన : http://teluguglobal.com/analyst-c-narasimharao-comments-on-jagan/

జగన్ కు రాజకీయాలు అవసరమా ?

ఇప్పటివరకూ జరిగిన జప్తు 5,000 కోట్లు
ఇంకెంత ఆస్తి ఉందొ ?
ఇలాంటి ధనవంతులకు రాజకీయాలు ఎందుకట
హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చోక
జగన్ ఒకవేళ నిజంగా తప్పు చేయలేదే అనుకుందాం
అయితే మాత్రం రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు ఉందా?
ఇన్ని వేల కోట్ల ఆస్థిపరుడికి ఒక పార్టీ, అధికారం అవసరమా
సగం ఆస్తి పేదలకు పంచి పేరు తెచ్చుకోవచ్చుగా

Tuesday 28 June 2016

కాంగ్రెస్ కు మరోసారీ విశ్రాంతి

తవ్వే కొద్దీ  పడుతున్న కుంభకోణాల వెలికితీతలో
మసక బార్చిన దేశ ప్రతిష్ట తిరిగి తీసుకు రావడంలో
అన్ని రకాల వ్యవస్థల్లో ప్రక్షాళనలో
తలమునకలవుతున్న మన మోడీ
తాను చెప్పినవి ఆలస్యమైనా
తప్పక నెరవేరుస్తాడు !
అవినీతి కాంగ్రెస్ కే  రెండుసార్లు అధికారం ఇఛ్చిన ప్రజలు
సచ్ఛీల మోడీకి మరోసారీ బ్రహ్మరధం పెట్టరూ !
 అయితే
ఒకసారి తెలుగు రాష్ట్రాల వంక చూస్తే
ఎన్ని పునాధులు కదులుతాయో


బాబు బిచ్చెమెత్తితే పెట్టుబడులు రావు

ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రాన్ని నిలదీయకుండా
"హోదా" సంజీవినే కాదంటూ
ప్రజల సొమ్ముతో ప్రపంచదేశాలు చుట్టినా
పెట్టుబడులు రాలవు
24 గంటలు కరెంటు మాత్రమే కాదు
ఇస్తానన్న హోదా ముఖ్యమే !

Monday 20 June 2016

యూపీలో వందమంది ఎమ్మెల్యేలకు నో సీట్లు

వ్యతిరేకత ప్రదుత్వంపై కాదట
అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అట
అందుకే సీట్లు ఇవ్వరట
కొత్తవారు బాగా చేస్తారని గ్యారెంటీ ఏమిటట ?
మీ చేతకాని తనాన్ని ఎమ్మెల్యేలపై నెట్టే ఏర్పాటు బెడిసి కొడుతుందేమో
ఉన్నదీపొయే ... సామెత నిజమావుతుందేమో
చూసుకోండి అఖిలేష్ అయ్యవారూ .




విత్తనాలే లేని ఏరువాక

నాగలి దున్నుతూ ,
విత్తనాలు జల్లుతూ ,
మీడియా ఫోటోలకు ఫోజులు
విత్తనాలు రైతులకు అందేనా ?
కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే
రైతుకంట  కన్నీరు రానివ్వరాదు

Thursday 16 June 2016

జనం నేతల్ని ఇబ్బంది పెడుతున్న అంబటి

పోటీ చేసేంత ధైర్యం ఉంటే ,
రాజకీయ నైతిక విలువలు ఉంటే ,
వైకాపా పార్టీయే అసహ్యమైతే
ఆ గుర్తే నీచమైతే
జనం కోసం పార్టీ మారి ఉంటే ,
నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే ,
డబ్బుకు అమ్ముడు పోకుండా ఉంటే ,
చీమూ నెత్తురూ ఉంటే ,

ఇప్పటికే రాజీనామా చేసేవాళ్ళు కదా అంబటి అన్నా
వారిని ఎందుకు ఇబ్బంది పెడతావు



బాబుకు సాక్షి రుణపడి ఉండాలి

సాక్షి నిలిపివేతను నిరసిస్తూ బిజేపీ ఆందోళన సంగతి సరే
చైనాలో విద్యార్ధుల ప్రదర్సన కూడా
తమ సెట్ టాప్  బాక్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న
అభిమానులు
ఇక హైకోర్టులో కేసు
'సాక్షి' కి ఫుల్ పబ్లిసిటీ ఇచ్చి
మరింతగా అభిమానుల్ని పెంచుకునేలా
చేస్తున్న బాబుకు
సాక్షి రుణపడి ఉండాలి

బాబు ఖర్చు మిగిల్చిన జగన్

పదమూడో రీలు వరకూ
తనదే ఆధిపత్యం అని జగన్ ఒప్పుకున్నాడు కదా అని
వస్తున్న ఎమ్మెల్యేల రేట్లు తగ్గించారంట
వచ్చిన ఎమ్మెల్యేలతో ఫీట్లు చేయిస్తున్నారట
పడరాని పాట్లు పడుతూ
జగన్ నీవే దిక్కంటూ తిరిగి వచ్చే
ప్రయత్నాలకూ విఘాతం !
ఇక జగన్ పార్టీలో చివరకు మిగిలేది
జగన్ విధేయులూ
జనం మెచ్చిన వాళ్ళే నంటా
క్రొత్త ఆలోచనలకు శ్రీకారం
2019 కి సమాయత్తం


Wednesday 15 June 2016

బాబు పరీక్షకు ప్రజల మార్కులు

చూసి కాపీ కొట్టలేని పరీక్ష
నీవు రాసుకున్న ప్రశ్నలే
అవును/కాదు సమాధానాలు
జావాబు ఇవ్వాల్సింది నీవే
మార్కులు వేసేది ప్రజలు
పాసా ? ఫెయిలా ?
గడప గడపలో నీ అన్సర్ షీట్లు
రిజల్ట్స్ కోసం నిరీక్షణ

బాగుంది బాబూ పాలన

తన సొంత డప్పుకొట్టే  ఆంధ్రజ్యోతిని
తెలంగాణలో నిషేదిస్తే  ధర్నాలూ, ఆందోళనలూ ..
తన బాకా ఊదని  సాక్షికి
సంకెళ్ళు ఇక్కడ ..
ఒక టీవీ చానల్ కి కూడా భయపడే
ప్రభుత్వాలా ?

Tuesday 14 June 2016

చంద్ర పాపా(బాబా)లు

ఎదుటి పార్టీ వాళ్ళు  రౌడీలు, గూండాలు
అవినీతి జలగలు
అసెంబ్లీలోకి వచ్చిన ఖైదీలు !

వారి పాపాలు కడిగి పునీతులను చేసి
సచ్చీలులుగా చేయడానికి పుట్టుకొచ్చిన చంద్ర పాపాలు
 కాదు కాదు చంద్ర బాబాలు