Thursday 30 June 2016

నరసింహ వ్యాఖ్యానం

విశ్లేషకుడు  నరసింహారావు ఉండగా
ఆ చర్చలకు టిడిపి పార్టీవారు ఎందుకట ?
ఇలాంటి పార్టీలకు కొమ్ముకాసే విశ్లేషకుడు
టీవీలకు ఎందుకట ?
ఉద్యోగులు చచ్చినట్లు అమరావతికి రావాలట
జగన్ కి సిగ్గుంటే జనంలో కనపడకూడదట
అయినా
ఓటుకి నోటు కేసులో దొరికిన బాబు గారు భేష్ ఆట


స్పందన : http://teluguglobal.com/analyst-c-narasimharao-comments-on-jagan/

జగన్ కు రాజకీయాలు అవసరమా ?

ఇప్పటివరకూ జరిగిన జప్తు 5,000 కోట్లు
ఇంకెంత ఆస్తి ఉందొ ?
ఇలాంటి ధనవంతులకు రాజకీయాలు ఎందుకట
హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చోక
జగన్ ఒకవేళ నిజంగా తప్పు చేయలేదే అనుకుందాం
అయితే మాత్రం రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు ఉందా?
ఇన్ని వేల కోట్ల ఆస్థిపరుడికి ఒక పార్టీ, అధికారం అవసరమా
సగం ఆస్తి పేదలకు పంచి పేరు తెచ్చుకోవచ్చుగా

Tuesday 28 June 2016

కాంగ్రెస్ కు మరోసారీ విశ్రాంతి

తవ్వే కొద్దీ  పడుతున్న కుంభకోణాల వెలికితీతలో
మసక బార్చిన దేశ ప్రతిష్ట తిరిగి తీసుకు రావడంలో
అన్ని రకాల వ్యవస్థల్లో ప్రక్షాళనలో
తలమునకలవుతున్న మన మోడీ
తాను చెప్పినవి ఆలస్యమైనా
తప్పక నెరవేరుస్తాడు !
అవినీతి కాంగ్రెస్ కే  రెండుసార్లు అధికారం ఇఛ్చిన ప్రజలు
సచ్ఛీల మోడీకి మరోసారీ బ్రహ్మరధం పెట్టరూ !
 అయితే
ఒకసారి తెలుగు రాష్ట్రాల వంక చూస్తే
ఎన్ని పునాధులు కదులుతాయో


బాబు బిచ్చెమెత్తితే పెట్టుబడులు రావు

ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రాన్ని నిలదీయకుండా
"హోదా" సంజీవినే కాదంటూ
ప్రజల సొమ్ముతో ప్రపంచదేశాలు చుట్టినా
పెట్టుబడులు రాలవు
24 గంటలు కరెంటు మాత్రమే కాదు
ఇస్తానన్న హోదా ముఖ్యమే !

Monday 20 June 2016

యూపీలో వందమంది ఎమ్మెల్యేలకు నో సీట్లు

వ్యతిరేకత ప్రదుత్వంపై కాదట
అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అట
అందుకే సీట్లు ఇవ్వరట
కొత్తవారు బాగా చేస్తారని గ్యారెంటీ ఏమిటట ?
మీ చేతకాని తనాన్ని ఎమ్మెల్యేలపై నెట్టే ఏర్పాటు బెడిసి కొడుతుందేమో
ఉన్నదీపొయే ... సామెత నిజమావుతుందేమో
చూసుకోండి అఖిలేష్ అయ్యవారూ .




విత్తనాలే లేని ఏరువాక

నాగలి దున్నుతూ ,
విత్తనాలు జల్లుతూ ,
మీడియా ఫోటోలకు ఫోజులు
విత్తనాలు రైతులకు అందేనా ?
కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే
రైతుకంట  కన్నీరు రానివ్వరాదు

Thursday 16 June 2016

జనం నేతల్ని ఇబ్బంది పెడుతున్న అంబటి

పోటీ చేసేంత ధైర్యం ఉంటే ,
రాజకీయ నైతిక విలువలు ఉంటే ,
వైకాపా పార్టీయే అసహ్యమైతే
ఆ గుర్తే నీచమైతే
జనం కోసం పార్టీ మారి ఉంటే ,
నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే ,
డబ్బుకు అమ్ముడు పోకుండా ఉంటే ,
చీమూ నెత్తురూ ఉంటే ,

ఇప్పటికే రాజీనామా చేసేవాళ్ళు కదా అంబటి అన్నా
వారిని ఎందుకు ఇబ్బంది పెడతావు



బాబుకు సాక్షి రుణపడి ఉండాలి

సాక్షి నిలిపివేతను నిరసిస్తూ బిజేపీ ఆందోళన సంగతి సరే
చైనాలో విద్యార్ధుల ప్రదర్సన కూడా
తమ సెట్ టాప్  బాక్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న
అభిమానులు
ఇక హైకోర్టులో కేసు
'సాక్షి' కి ఫుల్ పబ్లిసిటీ ఇచ్చి
మరింతగా అభిమానుల్ని పెంచుకునేలా
చేస్తున్న బాబుకు
సాక్షి రుణపడి ఉండాలి

బాబు ఖర్చు మిగిల్చిన జగన్

పదమూడో రీలు వరకూ
తనదే ఆధిపత్యం అని జగన్ ఒప్పుకున్నాడు కదా అని
వస్తున్న ఎమ్మెల్యేల రేట్లు తగ్గించారంట
వచ్చిన ఎమ్మెల్యేలతో ఫీట్లు చేయిస్తున్నారట
పడరాని పాట్లు పడుతూ
జగన్ నీవే దిక్కంటూ తిరిగి వచ్చే
ప్రయత్నాలకూ విఘాతం !
ఇక జగన్ పార్టీలో చివరకు మిగిలేది
జగన్ విధేయులూ
జనం మెచ్చిన వాళ్ళే నంటా
క్రొత్త ఆలోచనలకు శ్రీకారం
2019 కి సమాయత్తం


Wednesday 15 June 2016

బాబు పరీక్షకు ప్రజల మార్కులు

చూసి కాపీ కొట్టలేని పరీక్ష
నీవు రాసుకున్న ప్రశ్నలే
అవును/కాదు సమాధానాలు
జావాబు ఇవ్వాల్సింది నీవే
మార్కులు వేసేది ప్రజలు
పాసా ? ఫెయిలా ?
గడప గడపలో నీ అన్సర్ షీట్లు
రిజల్ట్స్ కోసం నిరీక్షణ

బాగుంది బాబూ పాలన

తన సొంత డప్పుకొట్టే  ఆంధ్రజ్యోతిని
తెలంగాణలో నిషేదిస్తే  ధర్నాలూ, ఆందోళనలూ ..
తన బాకా ఊదని  సాక్షికి
సంకెళ్ళు ఇక్కడ ..
ఒక టీవీ చానల్ కి కూడా భయపడే
ప్రభుత్వాలా ?

Tuesday 14 June 2016

చంద్ర పాపా(బాబా)లు

ఎదుటి పార్టీ వాళ్ళు  రౌడీలు, గూండాలు
అవినీతి జలగలు
అసెంబ్లీలోకి వచ్చిన ఖైదీలు !

వారి పాపాలు కడిగి పునీతులను చేసి
సచ్చీలులుగా చేయడానికి పుట్టుకొచ్చిన చంద్ర పాపాలు
 కాదు కాదు చంద్ర బాబాలు