Wednesday, 31 August 2016

'సాక్షి' పేపరోళ్లకు సాక్ష్యాలేదొరకవా ?

అటు రుణమాఫీ చేశామని ధీమాగా ప్రభుత్వం చెపుతుంటే ...
అటు పట్టిసీమలో అవినీతి జరగలేదని హుందాగా అంటూంటే ...
రాజధానిలో అక్రమాలే లేవని బాకా ఊడుతుంటే ...
బాబు భయపడడం కల అని బల్ల గుద్ది హెచ్చరిస్తూంటే ...

తాము చెప్పిన వాటికి, రాసిన రాతలకు ఆధారాలు చూపలేని
సాక్షి పేపర్ ఎందుకు దండగ !
రుణమాఫీ జరగని ప్రజలతో మీటింగ్ పెట్టొచ్చుగా ...
అక్రమాలు ఆధారాలతో నిరూపించొచ్చు కదా !

ఓటుకు నోటు కేసులో బాబుగారు నిర్దోషి

మచ్చలేని చంద్రునికి మచ్చపెట్టాలని ప్రతిపక్షాల కుట్ర
ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి
ఇది సోమిరెడ్డి ఉవాచ !
మరి ఫోన్ లో గొంతెవరిదో ...
హైదరాబాద్  నుంచి ఆదరాబాదరా పయనమెందుకో ...
ట్యాపింగ్ కేసెందుకు పెట్టారో ...
ఎవరు చెప్తారట ?

Friday, 12 August 2016

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున జగన్ ని పుష్కరాల ఆహ్వానం

ఇంటింటికీ వెళ్లి చిన్నా చితకా నటులకు  కూడా పదిరోజుల ముందే ఇన్విటేషన్లు
ఒకరోజు గడిచాక ప్రతిపక్షనాయకుడికి ఈరోజు !
అబ్బెబ్బే ఇది అవమానించడం కాదు
మీరే అవమాన పడడం అని తెలుసుకోండి
శిశుపాలుని పాపాలు లెక్కిస్తున్నట్లు
జనం మీ పాపాలు లెక్కిస్తున్నారని మర్చిపోకండి !!
మీరు మారఋ ... కనీసం మారినట్లు నటించండి !!!


Saturday, 6 August 2016

రాష్ట్రపతి పలకరింపూ ప్రచారాస్త్రమే

రాష్ట్రపతిని కలిస్తే -
అందరూ మీలా పని చేస్తే చాలు
దేశం అభివృద్ధిలో దూసుకు వెళుతుంది
అని చంద్ర బాబు తో అన్నారంట!

పాపం ఆ పెద్దాయన వెటకారంగా
అందరూ మీలా "పార్టీలను చీల్చితే" , "ప్రతిపక్షాల గొంతు నొక్కితే" చాలు
"తెలుగుదేశం"  అభివృద్ధిలో
దేశం అవినీతిలో దూసుకు వెళుతుంది
అని ఉండవచ్చు