Monday 23 April 2018

జగన్ ను నిర్దోషిగా ప్రకటిస్తాను ... బాబును దోషిగా ప్రచారం చేస్తాను

జగన్ లక్ష కోట్లను బయటికి తీయడానికి బాబుకు ఇంకా ఎన్నేళ్లు కావాలి?
తానూ అధికారంలోకి వస్తే జగన్ తిన్న సొమ్మును కక్కిస్తానని హామీ ఇస్తే
ఆ అవినీతి పరుడి కంటే నీవే గొప్పోడివని
ఓటు వేసాను

ఇప్పటికి నాలుగేళ్లు అయింది
నీవు ఇచ్చిన హామీల్లో ఈ హామీ కూడా తప్పావ్

చంద్రబాబూ -
నీ హామీలకు ఎంత క్రెడిబిలిటీ లేదో
అర్ధమైంది

ఇంకా నీకు ఆరు నెలలు సమయం ఇస్తున్నా ...
అప్పటిలోగా జగన్ ని జైలుకి పంపకపోయావో
జగన్ ను  నిర్దోషిగా నేను ప్రకటిస్తాను
అంతేకాదు
నిన్ను దోషిగా నిలబెడతాను




Friday 23 March 2018

చంద్రబాబు చేపడుతున్న "ఆపరేషన్ నారద" ... సీక్రెట్ మిషన్ బట్టబయలు

ఒకే దెబ్బకు ఐదు పిట్టలు - చంద్రబాబు చేపడుతున్న "ఆపరేషన్ నారద" ... సీక్రెట్ మిషన్ బట్టబయలు - గేట్ వే హోటల్ లో రూపకల్పన

ఆపరేషన్ ఎల్లో ఫ్లవర్  కు అనుభందం

ఆపరేషన్ నారద వివరాలు : నారా + దా = నారద

ఆపరేషన్ నారద వివరాలు :  మళ్ళీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకు రావడానికి ఈ ఆపరేషన్ . "నారా" అంటే నారా చంద్రబాబు . "దా" అంటే మళ్ళీ అధికారం 

ఆపరేషన్ నారద వివరాలు :శివాజీరూపంలో దుమ్మెత్తిపోయడం


ఆపరేషన్ నారద వివరాలు :  సబ్బం హరి ఆపరేషన్ బృందం సభ్యుడు

ఆపరేషన్ నారద వివరాలు : ఆపరేషన్ లో పలువురు మాజీ కాంగ్రెస్ నేతలు + లోకేష్ + ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త

ఆపరేషన్ నారద వివరాలు :  రూ.1500 కోట్లు కేటాయింపు. మరిన్ని పిరాయింపులకు సంప్రదింపులు
ఆపరేషన్ నారద వివరాలు : ఇప్పటి వరకూ రూ.350 కోట్లు ఖర్చు . వైసిపి ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.225 కోట్లు . నంద్యాల ఎన్నికలకు రూ.45 కోట్లు
ఆపరేషన్ నారద వివరాలు : నిధుల సమీకరణ ఇప్పటికే పూర్తి. మరిన్ని నిధుల కోసం కాంగ్రెస్ అగ్ర నాయకులతో సంప్రదింపులు



Friday 23 February 2018

మరో రాజకీయ ఎత్తుగడ

భారత దేశపు రాజకీయ ఉద్దండుడు
ఎత్తులు వేయడంలో శకునిని మించినవాడు
వెన్నుపోటులకు రారాజు
ఇప్పుడు తన రాజకీయ జీవితంలో క్రొత్త జిత్తులు చూపుతున్నాడు
ప్రత్యేక హోదా మళ్ళీ అందుకున్నాడు
మోడీకి ఎసరు పెట్టడానికి రెడీ అయ్యాడు



Friday 16 February 2018

బాబు చేతిలో బిజేపీ బలిపశువు

ఖర్చు చూపిస్తే డబ్బులు ఇస్తామంటుంది కేంద్రం..
డబ్బులు ఇస్తే ఖర్చు చూపిస్తామంటుంది రాష్ట్రం ..

ఇచ్చిన ఆ కాసిన్నీ రుణ మాఫీలకు, ఎన్నికల హామీలకు సరి
ఆ లెక్కలు చూపిస్తే .. ఇది మా ఖర్చు కాదు అంటోంది కేంద్రం

ఎవర్ని నమ్మాలి ..

మబ్బుల్లో నీరు చూసి ముంత వోలకబోసినట్లు
రాబోయే నిధులు చూసుకుని ఉన్నదంతా విమాన ఖర్చులతో సరి..

ఇక క్రొత్తగా ఏమి హామీలు ఇస్తారు ..
మరి ఈ ఎన్నికల యజ్ఞంలో తాను గెలవాలంటే..
ఒక బలిపశువు కావాలి

అది బిజేపీయే అయితే



లోకేష్ బాబుకి అవార్డులు ఇందుకు వచ్చాయా?

తన కొడుక్కి అవార్డులు వస్తున్నాయని మురిసిపోయారు ..
ఆవార్డులు ఇచ్చి,
 ఇదిగో మీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకు పోతుందని
చెప్పడానికి కేంద్రం లోకేష్ కు ఇలా అవార్డులు ఇచ్చిందని
ఇక ప్రత్యెక హోదాయే కాదు
ప్యాకేజ్ కూడా మీ రాష్ట్రానికి అక్కర్లేదని
చెప్పకనే చెప్పిందని
అర్ధం కాలేదు