Friday 23 February 2018

మరో రాజకీయ ఎత్తుగడ

భారత దేశపు రాజకీయ ఉద్దండుడు
ఎత్తులు వేయడంలో శకునిని మించినవాడు
వెన్నుపోటులకు రారాజు
ఇప్పుడు తన రాజకీయ జీవితంలో క్రొత్త జిత్తులు చూపుతున్నాడు
ప్రత్యేక హోదా మళ్ళీ అందుకున్నాడు
మోడీకి ఎసరు పెట్టడానికి రెడీ అయ్యాడు



Friday 16 February 2018

బాబు చేతిలో బిజేపీ బలిపశువు

ఖర్చు చూపిస్తే డబ్బులు ఇస్తామంటుంది కేంద్రం..
డబ్బులు ఇస్తే ఖర్చు చూపిస్తామంటుంది రాష్ట్రం ..

ఇచ్చిన ఆ కాసిన్నీ రుణ మాఫీలకు, ఎన్నికల హామీలకు సరి
ఆ లెక్కలు చూపిస్తే .. ఇది మా ఖర్చు కాదు అంటోంది కేంద్రం

ఎవర్ని నమ్మాలి ..

మబ్బుల్లో నీరు చూసి ముంత వోలకబోసినట్లు
రాబోయే నిధులు చూసుకుని ఉన్నదంతా విమాన ఖర్చులతో సరి..

ఇక క్రొత్తగా ఏమి హామీలు ఇస్తారు ..
మరి ఈ ఎన్నికల యజ్ఞంలో తాను గెలవాలంటే..
ఒక బలిపశువు కావాలి

అది బిజేపీయే అయితే



లోకేష్ బాబుకి అవార్డులు ఇందుకు వచ్చాయా?

తన కొడుక్కి అవార్డులు వస్తున్నాయని మురిసిపోయారు ..
ఆవార్డులు ఇచ్చి,
 ఇదిగో మీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకు పోతుందని
చెప్పడానికి కేంద్రం లోకేష్ కు ఇలా అవార్డులు ఇచ్చిందని
ఇక ప్రత్యెక హోదాయే కాదు
ప్యాకేజ్ కూడా మీ రాష్ట్రానికి అక్కర్లేదని
చెప్పకనే చెప్పిందని
అర్ధం కాలేదు