Saturday 23 December 2017

బీజేపీ - ఐస్ క్రీమ్ పుల్ల...

ఐస్ క్రీమ్ పుల్ల విలువ ఐస్ తినేవాడికే తెలుస్తుంది
స్పూన్ వచ్చింది కదాని పుల్లని విసిరేస్తే ?

వచ్చే ఎన్ని"కల"లకు పవన్ మిత్రుడు ఉన్నాడు కదా అని
కులసమీకరణాల లెక్కలు వేసుకుంటూ
కమ్మలతో పాటూ కాపులూ రెడ్లూ ఉన్నారని
బీసీలను దూరం చేసుకుంటూ ఉంటే

మూడుకులాలను ఏకం చేశామని సంకలు గుద్దుకుంటూ
ఏసీ విమానాల్లో ... భ్రమరావతి గురించి కలలు కంటూ

2జి కేసు నీరుగారిపోయింది వేళ..
జగన్ కి కూడా విముక్తి కలుగుతుందేమో నని ఉలిక్కిపడిన వేళ

బీజేపీ బలపడితే తమ చాపక్రిందకు పోలవరం నీరు రాదేమోనని
పుల్లలా తీసిపారేసి
క్రొత్త మిత్రుడిని వెతుక్కొనే అవకాశం కల్పించిన వేళ

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ముఖ్యమంత్రే అని
తెలుసుకొండి

గుజరాత్ ఎన్నికల ఫలితాలతో ఏపార్టీ ఏం చెప్పింది?

గుజరాత్ లో బీజేపీ గెలిచి ఏం చెప్పింది ?

ఎటువంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొని గెలవగలమని
ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోగలమని
మత పరంగా విభజన చేస్తే ఓట్లు సాధించవచ్చని
పాకిస్తాన్ పట్ల ద్వేషాన్ని కూడా ఓట్లగా మార్చుకోవచ్చని

గుజరాత్ లో ఓడి  కాంగ్రెస్ ఏం  చెప్పింది ?

22 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండికూడా పార్టీ కనుమరుగు కాలేదని
కులపరంగా విభజిస్తే అంత ఉపయోగం లేదని
రాహుల్ పప్పు కాదు అని


ఇందుకేనా బీజీపీకి ఓటేసింది? !!!

నల్లధనం తీసుకురాలేదు...
2జి  స్కామ్ చల్లారిపోయింది
గంగానది ఇంకా మురికి కంపు కొడుతూనే ఉంది

అయితే ...
నా ఆధార్ కార్డు సిమ్ కార్డుకు కలుపబడింది
క్రొత్త నోట్లు చలామణి లోకి వచ్చాయి
జీఎస్టీ తో బిల్లు వస్తున్నాయ్

ఇందుకేనా నేను బీజేపీకి ఓటేసింది ?!!!

Friday 15 December 2017

గాలివార్తలతో కోట్లు సంపాదిస్తున్న టీవీ9

వీక్షణలు ద్వారా డబ్బులు సంపాదించాలని
సోషల్ మీడియాలో పుకార్లు, గాలి వార్తలు పెడుతున్నారు కొందరు .
ఆ ఊసిపోని వీడియోలు పట్టుకుని రోజంతా చర్చిస్తూ
మళ్ళీ వారికీ వీరికీ గొడవలు పెట్టి ఎంజాయ్ చేస్తూ రెంటింగుల కోసం
ప్రాకులాడుతున్న TV9 ...

మళ్ళీ అదే వీడియోలను ముక్కలు ముక్కలుగా యూట్యూబ్ వీడియోల ద్వారా
అప్ లోడ్ చేసి కోట్లు సంపాదిస్తుంది TV9

నష్టపోయేది ఎవరు ?
లాభం పొందుతుంది అయితే TV9





Thursday 7 December 2017

అమరావతిలో ఒక్క బిల్డింగ్ కట్టలేనివారు పోలవరం కడతారట !

నాలుగేళ్లవుతుంది ...
అమరావతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది
ఇక్క ఇటుక ముక్క పేర్చలేదు .
మీరు కట్టాల్సిన రాజధాని కట్టలేదు
మీకు పోలవరం కావాలా ?
ఎందుకు ?
భూములపేరుతో అస్మదీయులకు అంటా అందిందా ?
ఇక ముట్టాల్సింది పోలవరం ముదుపులేనా ?
వచ్చే ఎన్నికల్లో పంచడానికి ఎన్ని కోట్లు కావాలో  లెక్కల్లో ఉన్నారా ?

పవన్ ఎవర్ని ప్రశ్నించాలి ?

నమ్ముకుని ఓట్లేసిన వారిని ముంచి
ఇక తమకు అధికారం రాదు అని భావించి
తాను మంత్రి పదవి పొందడంకోసం కాంగ్రెస్ లో
ప్రజారాజ్యాన్ని కలిపేసిన  అన్నను ప్రశ్నించడం పోయి

ముఖ్యమంత్రి పదవి వస్తే ఇలా పరిపాలిస్తాను
అని చెపుతున్న జగన్ ను ప్రశ్నించడం ఏమిటి ?

నీవు మద్దతు ఇచ్చిన బీజేపీ , టిడిపి లను ప్రశ్నించడం ప్రారంభించు ముందు


Sunday 3 December 2017

ఇదిగో తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టో | TDP Manifesto of 2014 Elections AP and Telangana

చాలాకాలం నుంచీ తెలుగుదేశం మేనిఫెస్టో 2014 గురించి అందరూ తెగ వెతుకుతున్నారు ..
వారిచ్చిన హామీలేంటి ? ఎన్ని నెరవేర్చారు ?

ఇదిగో మీకోసం ఇక్కడ ఇస్తున్నా చూసుకోండి !

తెలంగాణా ఆంధ్రాలకు వేర్వేరుగా ఇచ్చారు . ఇమేజ్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది

https://drive.google.com/file/d/1I4ZH5CxQPJXKBVCjQTJ-J83rY59cDHHw/view?usp=sharing

https://drive.google.com/file/d/1kFXzIbUfhKgVM8SVZI90UZo4JOsn8nAR/view?usp=sharing

ఇంకెంతకాలం ఈ రిజర్వేషన్లు ?

అధికారం కోసం కులాల్ని మతాల్ని విభజించి
తాము రాజకీయ పబ్బం గడుపుకోడానికి
తానూ, తన కొడుకు, తన కొడుకు కొడుకు ...
ఎప్పుడూ అధికారంలో ఉండాలనే ఆశతో
రిజర్వేషన్ల భారతానికి స్వస్తి పలకాల్సిన తరుణంలో
ఇంకా కులాల్ని మచ్చిక చేసుకొని ఓటుబ్యాంక్  రాజకీయాలు !

సీఎం కుర్చీకి మాత్రం ఈ వర్గాలు ఆమడదూరం
వారి వీపులపై తాము స్వారీ చేయడానికి ప్రజల్ని గొర్రెల్లా మారుస్తున్న
ఓ కసాయిలూ ... అందుకు ఈ రిజర్వేషన్లు ?
ఎవరు అడిగారని ఈ రిజర్వేషన్లు ?
లేదా మీరు కలలుకంటున్న 2050 ?