Monday 12 September 2016

ప్యాకేజీ వల్ల ఇన్ని లాభాలు !

రైతు రుణమాఫీలకు
డ్యాఖ్రా రుణమాఫీలకు
నిరుద్యోగులకు నెల నెలా భృతికి
ఇంకా ఎన్నో ఎన్నికల హామీలు తీర్చడానికి
ప్యాకేజీ ఉపయోగ పడుతుంటే
అరిచి గీ  పెట్టడం భావ్యమా ?

ప్రత్యేక హోదా వల్ల తీవ్ర నష్టం అర్ధం అయింది

 పదేళ్లు కావాలని పార్లమెంటులో అరిచి గీపెట్టినప్పుడు వెంకయ్యనాయుడికి అర్ధం కాలేదు ...
పది కాదు పదిహేనేళ్ళు కావాలని ఎన్నికల సభల్లో వక్కాళించినప్పుడూ
ఢిల్లీ చుట్టూ 24 సార్లు తిరిగినప్పుడూ
  బాబుకు అర్ధం కాలేదు ...
ఆంధ్రకు హోదా ఇవ్వడానికి వీల్లేదని గీపెట్టిన 13 రాష్ట్రాల సీఎంకూ అర్ధం కాలేదు
ఇప్పుడు ఒకేసారి తెలిసింది
ఈ ముగ్గురికీ - వెంకయ్యకు , బాబుకు , సుజనా కు
"ప్రత్యేక హోదా " వల్ల నష్టమేనని..
ప్యాకేజీ ముద్దు అని

Sunday 11 September 2016

బీజేపీతో పాటూ తానూ మునుగుతానని ...

నాడు కాగ్రెస్ ను ముంచి
మామను వెన్నిపోటుపొడిచి
ప్రజలను మభ్యపెట్టి పీడించిన బాబును నమ్మి
మళ్ళీ ఓట్లేసిన పాపానికి
ప్రజలతో పాటూ
బీజేపీని ముంచడానికీ రెడీ
తనకు తెలీదు బీజేపీతో  పాటూ తానూ మునుగుతానని

Saturday 10 September 2016

నాడు కాంగ్రెస్ కు పట్టిన గతి రేపు టిడిపికి


రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అమ్మేశారు
నోట్లకి కొంత
ఓట్లకి కొంత
కాళ్ళక్రింద దూరే బానిసత్వానికి అంతా!!

ఆత్మ గౌరవం లేదు
ఆవకాయ పచ్చడి లేదు
నరంలేని నాయకులుంటే రాష్ట్రం నాశనమే!!

రక్తం మరిగిందని
ఇరవై సార్లు వెళ్ళి కలిశానని
ప్రత్యేకహోదా మాత్రమే కావాలని ప్రజలతో వంతపాడి
ఇచ్చినంతా తీసుకోక ఎంచేద్దామన్నప్పుడే
నీ మేక తోలు ఊడిపొయింది!!

చేతకాకపోతే దిగిపోవచ్చు
చేతనైతే ఎదుర్కొనవచ్చు
రెండిటికీ కాక
చేష్టలుడిగిన నీ మేకపోతు గాంభీర్యం
మమ్మల్ని పగలబడి నవ్వేలా చేస్తూంది!!

విభజన పై ఇచ్చిన ప్రజా తీర్పులో
ఒక రాజకీయవర్గం మాడి మసైపోయింది
కేంద్రం భజన చేస్తూ వారి తొత్తులామారిన
మీ వర్గం మరో తీర్పుతో దిగంతాలకేగుతుంది!!


రాష్ట్రమేమైనా పర్లేదు
నా కుర్చీ ఉండాలి
నేను క్షేమంగా ఉండాలనే
నీ ఆశయం ప్రజలపై రుద్దకు
ఎందుకంటే నిన్ను ప్రజలు రేవుకేస్తారు
ప్రతేకహోదా సబ్బుతో ఉతుకుతారు !!

సోర్స్ : http://ochinnamaata.blogspot.in/2016/09/blog-post_10.html

Friday 9 September 2016

అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు పట్ల స్పీకర్ అసంతృప్తి

ప్రతిపక్షానికి ప్రజా సమస్యలు పట్టవా ?
జగన్ పై కేసులు అందుకే ఇలా ఎదురుదాడి
వైకాపా బాధ్యత గల ప్రతిపక్షం కాదు ..
ఇవీ  మంత్రుల పలుకులు ...
చూద్దాం .. వచ్చే ఎన్నికల్లో తాము ప్రతిపక్షంలో కూర్చుని
ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో నేర్పిస్తారు కదా ?


Thursday 8 September 2016

పవన్ కళ్ళు తెరవాలి .. ఆయన ఒక వ్యక్తి కాదని గుర్తెరగాలి

చాలామందే ఉద్యమాలు చేస్తే రాణి హోదా తనతో వస్తుందా అని నిర్లిప్తత వద్దు
మీరు ఒక వ్యక్తి కాదు
మీరు ఒక శక్తి అని తెలుసుకోండి
మీరు తలచుకుంటే ప్రభుత్వాలు కూలడం , తారుమారు కావడం సాధ్యమే
రేపటి కాకినాడ సభ దానికి నాంది కావాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం కావాలి

ఆంధ్రజ్యోతికి, చంద్రబాబుకీ ప్యాకేజీనే ఎందుకు ముద్దు ?

పేరుకే ఆంధ్రజ్యోతి .. చెప్పేవన్నీ అంధకార నీతులే
అర్ధరాత్రి దాకా హై  డ్రామా నడిపి
చంద్రబాబుతో నిరంతరం చర్చిస్తున్న కేంద్రం అంటూ ఊదరగొట్టి
అరాకొరా ప్రాకేజీకి ఒప్పుకొని
దాన్నే పెద్దదిగా , గొప్పదిగా చేస్తున్న
ఆంధ్రజ్యోతిది ఇంతపెద్ద దగా
నోరుమెదపలేని బాబుది ఇంతపెద్ద మోసం


Sunday 4 September 2016

పచ్చపలుకులు : ఏపీకి సూపర్ ప్యాకేజీ అట


ఇవీ ఈనాడు , ఆంధ్రజ్యోతి లోని హెడ్ లైన్లు
పచ్చపార్టీలోని కార్పొరేట్లకు హోదా  కన్నా ప్యాకేజీయే ముద్దు
హోదా ఇస్తే వచ్చే పరిశ్రమలు తమకు పోటీ అవుతాయని
హోదా ఇస్తే తమ స్థలాలు ఉన్న అమరావతికన్నా రాయలసీమ , కోస్తాలు అభివృద్ధి చెందుతాయని
హోదా ఇస్తే బీజేపీకి మంచిపేరొస్తుందని
ప్యాకేజీ ఐతే పంపకానికి ఈజీగా ఉంటుందని
ప్యాకేజీ మంచిదని నమ్మించేలా ఎల్లో మీడియా ముందే చిందులు



‘Stay’BN

ఇప్పటికి 18 కేసుల్లో స్టేలు
మచ్చలేని నాయకుడు
ఎవరికీ భయపడడం ఎరుగని నేత
...
అందుకే
నిజమైన నాయకుడంటే ఈయన !