Saturday 10 June 2023

టిఆర్ఎస్ నాయకులకు ఎపి అంటే చిన్నచూపు ఇందుకేనా!

 టిఆర్ఎస్ నాయకులు ఎపిని ఎందుకు చిన్నచూపు చూస్తారో తెలుసా?

నిజానికి సంక్షేమ కార్యక్రమాలలో, ప్రజా పాలనలో, ప్రజాస్వామ్య విలువలలో తెలంగాణా కన్నా ఆంధ్రప్రదేశ్ ముందే ఉంది. 

ఒకవైపు తెలంగాణా ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ వార్తలు మీడియా ద్వారా వింటూనే ఉన్నారు. 

వారు తమ మనస్సులో తమకి కూడా ఇలాంటి అభివృద్ధి అందితే బాగుండును అనిఅనుకుంటున్నారు అని ముందే పసిగట్టిన తెలంగాణా ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోలేక, ఎక్కడ తమకి వ్యతిరేకత వస్తుందో అని ముందే ఆంధ్రా ప్రభుత్వం మీద బురద జల్లుతూ .. 

ఆంధ్ర అధిగతిలో పోతుంది అని, ఇక్కడ అభివృద్ధి శూన్యం అంటూ ముందే పల్లవి అందుకుంటూ ఉన్నారు 

ఇక ఎన్నికలు సమీపించేకొద్దీ వీరి ఏడుపులు పెదబోబ్బలుగా మారడం ఖాయం.. 


1 comment:

  1. నాకు రాజకీయాల గురించి తెలియదండీ. ఒక్క విషయం చెబుతాను. నేను హైదరాబాదులో ఉంటాను. నా డెస్క్‌టాప్‌ను పక్షంరోజులకు పైగా షట్‌డౌన్ చేయకుండా నడవటం చూసాను. అంటే అన్నాళ్ళు కరెంటు పోలేదు మా అపార్ట్‌మెంట్‌లో.ఇటువంటిది సాధారణంగా గమనిస్తూనే ఉన్నాను. కాని అంధ్రాలో కరెంటు సరిగా ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. కాని అభివృద్ధి విషయంలో తెలంగాణా కన్నా అంధ్రా ముందుంది అని మీరు అంటున్నదానికి ఇది పొసగటం లేదు. బహుశః మీడియావాళ్ళంతా ఆంధ్రాపై కక్షగట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నమాట.

    ReplyDelete