Sunday, 31 July 2016

మన బాబుగారైతే బందు ఇలా చేస్తారు

బందులంటే షాపులు మూయడం కాదు
బందంటే బస్సులు ఆపడం కాదు
బందంటే రోడ్లమీదకు రావడం కాదు
బందంటే పని చేయక పోవడం కాదు
మరి బందంటే
మరింత ఎక్కువగా పనిచేయడం
షాపులు మరింత ఎక్కువగా తెరిచి ఉంచడం
బస్సులు మరిన్ని తిప్పడం
రోడ్లు ఊడ్చడం
డ్రైనేజీలు క్లీన్ చేయడం
మొక్కలు నాటడం
మరి మన బాబుగారైతే బందు ఇలానే చేస్తారట !
ఇంతకూ ముందు చూసాం ఎలాచేసారో !
ఇకముందూ చూస్తాం ఎలా చేస్తారో !!

Friday, 29 July 2016

అర్థం చేసుకొనే పరిణితి ప్రజలకు వుంది

తన లేఖతో విభజించారని
బిల్లు ఆమోదమైన వెంటనే సెహబాష్ అంటూ
ఐదు లక్షల కోట్లు కావాలని పలికి
ఆనక
 హోదాతో ఒరిగేదేం లేదంటూ ..
అంతకన్నా ఎక్కువ కావాలని
కేంద్రం అవన్నీ లెక్కలడగకూడదు అంటూ
హోదా ఇస్తే మోడీ ఖాతాలోకి పోతుందని ...
పోలవరం కడితే కేంద్రానికే పేరొస్తుందని
వఛ్చిన డబ్బు తన ఖాతా అభివృద్ధితో చూపిస్తూ
పట్టిసీమ , మెట్టసీమల పంపులతో పేరు కొట్టేద్దామని
మనసులో ఉన్నా
రాజ్యసభలో కాసింత హడావిడి చెయ్యకపోతే
జనం ఛీకొడతారని అనుకున్నా
తాము ఏంచేస్తున్నామో
అర్థం చేసుకొనే పరిణితి ప్రజలకు వుంది

Wednesday, 27 July 2016

బీజేపీని ముంచాలనే ప్రత్యేకహోదా వద్దన్నారా ?

నిజానికి ప్రత్యేక హోదాకు బీజేపీ కట్టుబడినా
హోదా ఇస్తే దానివల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని
తన గుర్తింపు రాదనీ
ఆ వెసులుబాట్లు కరెంటు, ఇతర సౌకార్యాల రూపంలో పొందుతూ
అభివృద్ధిలో తనకు మాత్రమే పేరు వచ్చేలా
వ్యవహరిస్తున్న బాబుగారి
ఉచ్చులో పడితే బీజేపీ చిక్కుల్లో పడడం ఖాయం !

Tuesday, 26 July 2016

టిడిపిలో మంత్రి కామినేని

కామినేని వారూ ..
నేడు తెలుగుదేశం కార్యకర్తల సమావేశాలకు మీరు వెళితే
రేపు బీజేపీ కార్యకర్తలకు ఏం సందేశమిస్తారు ?


 1c6a4042-1050-47b1-ae41-c2c4373a7492

Tuesday, 19 July 2016

సింగపుర్ కంపెనీలు చంద్రబాబుతో మాత్రమే సంప్రదింపులు జరిపితే ?

తమ తమ సీక్రెట్ ఎజెండాలతో
కేవలం బాబుని మాత్రమే నమ్ముకుని
రాజధానిలో పాగాకు ప్రయత్నిస్తే
వచ్ఛే ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం ఖాయం !
ఇప్పటికైనా తెలుసుకుని కనీసం తామైనా
పారదర్శకంగా వ్యవహరించి
కేంద్రం , ప్రతిపక్షపార్టీలతో చర్చిస్తే మేలు !
ఇది ఒక ఏడాదో , రెండేళ్లో సాగే వ్యవహారం కాదు
2050 వరకూ మీ ఆధిపత్యానికి అనుమతి కదా ?

Wednesday, 13 July 2016

మోడీగారి సర్వేలో బాబుగారికి 13వ ర్యాంక్

మొన్న NCAER సర్వేలో ఆంధ్రకు  మొదటి స్థానం ఇస్తే
 ( లింక్ : http://www.ndtv.com/india-news/gujarat-delhi-most-investment-friendly-contradictory-to-bihar-jharkhand-1426540 )

నేడు మోడీగారు పదమూడో ర్యాంక్ ఎలా ఇస్తారని
తెలీని సాధారణ కార్యకర్తలు
మొన్న మొదటి ర్యాంకు అవినీతికి అనీ
నేటి పదమూడో ర్యాంక్ పనితనానికి అనీ
గమనించి ...
నాలిక్కర్చుకున్నారుట !

బాబు కళ్లకు గంతలు

ఆనాడు బందర్ పోర్టుకు ఐదు వేల ఎకరాలు ఎందుకు అన్నారు
నేడేమో లక్ష ఎకరాలు చాలవంటున్నారు !
ఆనాడు రైతు రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకమన్నారు
నేడు వడ్డీల వాయిదాలు చెల్లిస్తున్నారు !
ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు పందికొక్కులు అన్నారు
నేడు వారినే నెత్తికి ఎక్కించుకుంటున్నారు !
నాడు చేదైనవి ఈ రోజు మిఠాయిలు అయ్యాయా ?
నాటి తీపి కబుర్లు నేడు నీటిపై రాతలయ్యాయా ?
ఇలా ప్రజలను  ఇబ్బందులకు గురిచేసి
వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి
ఆగ్రహానికి గురయ్యే సలహాలు
బాబుకు ఎవరిస్తున్నారో పాపం

Thursday, 7 July 2016

ఎన్నిసార్లు ప్రారంభించినా తప్పు లేదు

కాంట్రాక్టర్లకు బోనస్ ఇప్పించడానికి 
ఆదరా బాదరా ఎక్కడినుంచో మోటార్లు తెఛ్చి బిగించి 
ఆ ప్రారంభోత్సవంలో 
జల క్రీడలు ఆడినా తప్పులేదు
పుష్కరాలు దగ్గర పడుతుండడంతో 
ఇంకా పూర్తేకాని కాలువను కాసేపు తడపడానికి 
ప్రారంభించినా తప్పు లేదు 
మరెన్నో సార్లు ప్రతీమైలు రాయి 
కాలవ తవ్వకంలో ,
గ్రామ గ్రామాన ప్రారంభించినా తప్పులేదు 
పట్టిసీమ ఉట్టిసీమ అయిపోకూడదు మరి

Wednesday, 6 July 2016

"కృష్ణాగోదావరి" నది

తుంగభద్రా పెన్నానదుల అనుసంధానమైన కేసీ కెనాల్
కృష్ణా పెన్నాలను కలిపిన తెలుగు గంగా
లను మించి
ఆనాడు రాజశేఖర్ రెడ్డి తవ్విన 120 కిలోమీటర్ల
పోలవరం కుడి కాలువలోకి
పంపుల ద్వారా నీరు తోడి
పవిత్ర కృష్ణ కోదావరి నదులను
కలిపేందుకు పూనుకున్న
మన ప్రభుత్వం ఎంత గొప్పదో కదా !
ఆ ఉత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళూ చాలవేమో !!
13600048_1250942278291640_8942982499334238231_n
13620710_1250942808291587_41386086054009137_n

ఈ మాత్రం "కాపీ" కే అంత రాద్దాంతమా ?!

ఎమ్మెల్యేలను లాగు "కొనడం"లోనూ
హరితహారం లోనూ
జీతాల పెంపులోనూ
చార్జీల పెంపులోనూ
ప్రతిపక్షాలను అణచివేయడంలోనూ
పత్రికల గొంతు నొక్కడంలోనూ
టీవీ చానళ్ల నిషేదంలోనూ
కాపీ కొడితే అడగని వాళ్ళు
ఇప్పుడు
ఒక చిన్న వెబ్సైట్ కాపీ కొట్టిందని
ఎందుకు గొంతు చించుకోవడం ?



Tuesday, 5 July 2016

కృష్టా పుష్కరాలకు గోదావరిలో మునకలు

క్రిష్ణా
గోదావరి
నదులు రెండిటికీ
ఒకే సారి వరదలు వస్తాయి అన్నారు కదా !
ఇప్పుడు చూడండి గోదారికి వరద వచ్చినా
కృష్ణలో  ప్రవాహమే లేదు ..
మేం చేపట్టిన పట్టిసీమ సార్ధకం అయింది
ఆ రెండు పంపుల నీళ్లూ కృష్ణలో పోస్తాం
కృష్టా పుష్కరాలకు గోదావరిలో మునకలేయిస్తాం
 

గృహస్థాశ్రమం గురువులు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా ఏమి చేయాలట ?

ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు అంటూ 
రాష్ట్ర ప్రభుత్వం నియమించినా
తాను ఏమి చేయాలో బోధపడలేదో
లేక హిందూ ధర్మ విధ్వంసంలో
పాలు  పంచుకోడానికి విముఖుడయ్యో
చాగంటివారు  ఇంకా కేంద్ర ప్రభుత్వ సర్వీసు లోనే
నిచ్చింతగా ఉన్నారట !
13614930_1209397815789742_6068374747374606692_n

Monday, 4 July 2016

గడప గడపకి ఎటాచ్మెంట్లు

గడప గడపకీ
నూరు ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్
తీసుకువెళ్లే చేతులతోనే
ఎటాచ్ చేసిన ఆస్తుల జాబితా
కేసుల పూర్వాపరాల చిట్టా
మొత్తం ఆస్తుల లిష్టూ
కూడా తీసుకువెళ్ళండి

దేవతల్లారా కొండల్లోకి పారిపోండి


శేషాచలం
శబరిమల
శ్రీశైలం
సింహాచలం
అహోబిలం
అమర్నాథ్
వైష్ణొదేవి
తిరుత్తణి
హొరనాడు
శృంగేరి
మూకాంభికా
కనక డదుర్గమ్మ
భధ్రాచలం
పానకాల స్వామి
ఇలాంటి కొండ కోనలు
ఎంచుకోవాలి దేవతలు
తమ ఆవాసాలుగా!
శబ్దకాలుష్యం
మంత్రోచ్ఛారణల శబ్ద , దుమ్ము ధూళి కాలుష్యాలు సృషించే
మీరు మాకు పట్టణాల్లో వద్దు
పట్టణాలపై అధికారం 
మాదే
మీ గుడుల  ముందు బిచ్చ్చమెత్తుకునే మారిని
మీకోసం పరితపించేవారిని
మీపై భక్తి పారవశ్యంతో పరవసిస్తున్నవారిని
మీరే తీసుకుపోండి
మేం మాత్రం
వంద  కార్లు ఒకేసారి దూసుకుపోయే రోడ్లేసుకుంటాం
బిచ్చగాళ్ళేలేని  సమాజాన్ని సృష్టిస్తాం
మా పట్టణాన్ని దేవుడు లేని నగరంగా
సుందరీకరణ చేస్తాం
రోడ్లకు రెండు వైపులా
బార్లూ , మాల్ లూ , ఐమేక్స్ లూ  కట్టేస్తాం
మీరు మాత్రం కొండల్లోనే ఉండండేం ..
ఏదో ఏడాదికి ఓసారి తీరిక దొరికితే ఓ ప్రయాణం వేసుకుంటాం
మీరు మాకు రోజూ కనపడ్డానికీ , మీ మంత్రోచ్ఛారణలు వినపడ్డానికీ లేదు