Monday 4 July 2016

దేవతల్లారా కొండల్లోకి పారిపోండి


శేషాచలం
శబరిమల
శ్రీశైలం
సింహాచలం
అహోబిలం
అమర్నాథ్
వైష్ణొదేవి
తిరుత్తణి
హొరనాడు
శృంగేరి
మూకాంభికా
కనక డదుర్గమ్మ
భధ్రాచలం
పానకాల స్వామి
ఇలాంటి కొండ కోనలు
ఎంచుకోవాలి దేవతలు
తమ ఆవాసాలుగా!
శబ్దకాలుష్యం
మంత్రోచ్ఛారణల శబ్ద , దుమ్ము ధూళి కాలుష్యాలు సృషించే
మీరు మాకు పట్టణాల్లో వద్దు
పట్టణాలపై అధికారం 
మాదే
మీ గుడుల  ముందు బిచ్చ్చమెత్తుకునే మారిని
మీకోసం పరితపించేవారిని
మీపై భక్తి పారవశ్యంతో పరవసిస్తున్నవారిని
మీరే తీసుకుపోండి
మేం మాత్రం
వంద  కార్లు ఒకేసారి దూసుకుపోయే రోడ్లేసుకుంటాం
బిచ్చగాళ్ళేలేని  సమాజాన్ని సృష్టిస్తాం
మా పట్టణాన్ని దేవుడు లేని నగరంగా
సుందరీకరణ చేస్తాం
రోడ్లకు రెండు వైపులా
బార్లూ , మాల్ లూ , ఐమేక్స్ లూ  కట్టేస్తాం
మీరు మాత్రం కొండల్లోనే ఉండండేం ..
ఏదో ఏడాదికి ఓసారి తీరిక దొరికితే ఓ ప్రయాణం వేసుకుంటాం
మీరు మాకు రోజూ కనపడ్డానికీ , మీ మంత్రోచ్ఛారణలు వినపడ్డానికీ లేదు

 

No comments:

Post a Comment