Saturday, 19 November 2016

నల్లధనం నోట్లరూపంలో ఉంటుందా ? మీరే చెప్పండి .....

చాన్నాళ్లుగా అనేకమంది అవినీతి జలగలపై అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. వారందరి ఇళ్లలో బినామీ స్థలాలు, ఇళ్ళు , బంగారం లాంటివి కోట్లలో పట్టు పడితే నగదు కేవలం లక్షల్లో , చాలా సార్లు వేలలో మాత్రమే దొరికేది...
అంతెందుకు మొన్నీ మధ్య హతమైన నయీమ్ వద్దకూడా నగదు రూపంలో పట్టుపడింది చాలా తక్కువ ..
ఇది 1-2 శాతాలకు మించదు...
మరో ముఖ్యమైన విషయం -
ఒక కోటి రూపాయలు వెయ్యి నోట్లతో దాయాలంటే 10,000 నోట్లు కావాలి అంటే 100 కట్టలు కావాలి .. దీనిని  భద్రపరచడానికి చాలా స్థలం కావాలి . అదే బంగారంగా మారిస్తే 4 కేజీలు అవుతుంది . అంటే చిన్న పెట్టిలో పెట్టొచ్చు. అలాగే నోట్లు భద్రపరిస్తే చెదలు పట్టొచ్చు , కాగితాలు  పాడైపోవచ్చు.
మరి అలాంటప్పుడు నోట్ల రూపంలో నల్ల ధనం ఉండే అవకాశం ఉందా ?
మీరే చెప్పండి

Tuesday, 15 November 2016

ఈయన దగ్గర అసలు నోట్లే లేవట


పెద్ద నోట్లు రద్దుచేయమని ఏనాడో చెప్పిన ఈయన
అప్పటికే సింగపూరుకు, స్విస్ బ్యాంకుకు  సరుకుని తరలించారని
జనాలు చెవులు కొరుక్కున్నా
అనుచర డర్టీ ఫెల్లోస్ తమకి మాట మాత్రం చెప్పలేదని ఫీల్ అవుతున్నారట
ఢీ  అంటే ఢీ అనేవాడే మోడీ అని తెలియని వీళ్లు
తమ నాయకుడి అసలు బండా(గా)రం ఎక్కడ బయట పడుతుందో అని
కంగారు పడుతున్నారట

Saturday, 12 November 2016

బాబుగారు తిప్పుతున్న మరో చక్రం- ఆంధ్రాలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయట

ఆంధ్రాలో విచ్చలవిడిగా చేర్చుకున్న నేతలకు
సీట్లు సర్దడానికి అసెంబ్లీ స్థానాలను 225 కి పెంచె పనిలో ఉన్నారట
ఎక్కడెక్కడ ఎయె స్థానాలు కావాలో ఇప్పటికే లిస్టు వెళ్లిపోయిందట
ఇక శీతాకాల సమావేశాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు.