Saturday, 19 November 2016

నల్లధనం నోట్లరూపంలో ఉంటుందా ? మీరే చెప్పండి .....

చాన్నాళ్లుగా అనేకమంది అవినీతి జలగలపై అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. వారందరి ఇళ్లలో బినామీ స్థలాలు, ఇళ్ళు , బంగారం లాంటివి కోట్లలో పట్టు పడితే నగదు కేవలం లక్షల్లో , చాలా సార్లు వేలలో మాత్రమే దొరికేది...
అంతెందుకు మొన్నీ మధ్య హతమైన నయీమ్ వద్దకూడా నగదు రూపంలో పట్టుపడింది చాలా తక్కువ ..
ఇది 1-2 శాతాలకు మించదు...
మరో ముఖ్యమైన విషయం -
ఒక కోటి రూపాయలు వెయ్యి నోట్లతో దాయాలంటే 10,000 నోట్లు కావాలి అంటే 100 కట్టలు కావాలి .. దీనిని  భద్రపరచడానికి చాలా స్థలం కావాలి . అదే బంగారంగా మారిస్తే 4 కేజీలు అవుతుంది . అంటే చిన్న పెట్టిలో పెట్టొచ్చు. అలాగే నోట్లు భద్రపరిస్తే చెదలు పట్టొచ్చు , కాగితాలు  పాడైపోవచ్చు.
మరి అలాంటప్పుడు నోట్ల రూపంలో నల్ల ధనం ఉండే అవకాశం ఉందా ?
మీరే చెప్పండి

1 comment: