వార్తలో వైసీపి అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అని, వైకాపా అని కానీ లేకుండా గొడ్డలి పార్టీ అని నిర్ణయిస్తూ వార్తా వ్రాయడం ఎంతవరకు సమంజసం...
దిగజారుడు పత్రిక పచ్చ పత్రిక అనడానికి సాక్ష్యం!
వార్తలో వైసీపి అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అని, వైకాపా అని కానీ లేకుండా గొడ్డలి పార్టీ అని నిర్ణయిస్తూ వార్తా వ్రాయడం ఎంతవరకు సమంజసం...
దిగజారుడు పత్రిక పచ్చ పత్రిక అనడానికి సాక్ష్యం!
మీరు వేసుకునేది Armani సూటు, పెట్టుకునేవి Movado వాచీ, Bvlgari కళ్ళద్దాలు.. వాడేది Mont Blanc పెన్ను, iPhone .. తిరిగేది Mercedes కారు, Boeing విమానం ... కట్టేది Kenneth Cole షూస్....
ముందు అవి మార్చండి ..
తర్వాత మాకు చెప్పండి
Suit - Armani
— Ankit Mayank (@mr_mayank) September 21, 2025
Watch - Movado
Glasses - Bvlgari
Pen - Mont Blanc
Mobile - iPhone
Car - Mercedes
Plane — Boeing
Shoes - Kenneth Cole
And this drama queen is preaching about ‘Made in India’ 🤣🤣🤣 pic.twitter.com/ruQCWHuYuN
‘‘సముద్రం ఒకడి కాళ్ళ ముందు కూర్చొని మొరగదు/ తుఫాన్ గొంతు ‘చిత్తం’ అనడం
ఎరగదు/ పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చెయ్యదు.’ పదేళ్ళ కిందట జనసేన పార్టీ
విశాఖ సభలో పవన్ కల్యాణ్ తనని తాను వేలితో చూపించుకుంటూ సము ద్రంగా,
తుఫాన్‌గా, పర్వతంగా అభివర్ణించుకుంటూ చెప్పిన మాటలివి. ‘చుట్టూ
గాఢాంధకారం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు’ వంటి స్థితిలో ప్రజలున్నారని,
వారి ఆశలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు పంచి అపర చేగువేరాగా
అవతరించాలన్న పవన్ ఉద్దేశాలు జగమెరిగిన వారికి అమాయకంగా కనిపించినా
ఎంతోమంది యువత అతన్ని నమ్మారు. పవన్ ఒంటిమీద పిచ్చుక వాలినా జనసేన
కార్యకర్తలు బ్రహ్మాస్త్రాలు సంధించారు.
సినీహీరోగా తనకున్న
ఇమేజ్‌ని గుడ్ విల్‌గా పెడితే చాలదని, అంతకి మించి ఏదో చేయాలన్న తపనని
వ్యక్తం చేయడానికి ఆయన పలుమార్లు ప్రగతిశీల సాహిత్యాన్ని తన ప్రచారానికి
వాడుకున్నారు. ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళితే అక్కడి స్థానిక రచయితలను
గుర్తించి వారి రచనల్లోని ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు.
గుంటూరు
శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలు తరుచుగా చదివేవారు. ఆయా సాహిత్య అంశాలలోని
అభ్యుదయం, ప్రజాపక్షపాతం, నిర్భీతి వంటివి పవన్ వ్యక్తిత్వ సుగుణాలని జనం
నమ్మేలా బట్వాడా అయ్యాయి కూడా. తద్వారా మిగతా రాజకీయ నాయకులకి భిన్నమైన
ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
విప్లవకారులుగా చలామణీ అవ్వడానికి
మొహం చెల్లని రాజకీయాల్లో అట్టడుగు ప్రజల కష్టాలు తీర్చగల రాబిన్ హుడ్‌నని
ఆయన నమ్మే ఉండాలి. లేకపోతే అంత సులువుగా ‘జై భీమ్’ అని, అంతే సులువుగా
‘గో మాంసం, బీఫ్ తినడం తప్పయితే, అవి తినే ముందుకు వెళ్తాన’ని ఎలా అనగలరు!
ఇఫ్తార్‌లో కూర్చుని గడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకుని మీలో ఒకడిని అనడం,
గోధ్రా, గుజరాత్ అల్లర్ల గురించి ప్రశ్నించడం, తన నాయనమ్మ దీపారాధన చేస్తే
దాంతో వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకుని, దేవుడూ దయ్యమూ లేవు’ అనేవాడని
గుర్తు చేసుకోవడం, మతపరమైన గొడవలు పెడుతున్నది ముఖ్యంగా హిందూ నాయకులని
గట్టిగా చెప్పడం ద్వారా పవన్ కొన్నివర్గాల నుంచి మైలేజ్ పొందారు.
ఇక
ఇపుడు తరం మారకుండానే స్వరం మార్చారు పవన్ కల్యాణ్. అధికారంలోకి రాగానే
వేషభాషలు మారాయి. ఇపుడు తనని తాను ‘సనాతని హిందు’గా ప్రకటించుకున్నారు.
సనాతన ధర్మాన్ని కాపాడతానని, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటూ
అన్ని మతాలకీ ఒకటే న్యాయం అని ద్వంద్వానికి గురయ్యారు.
అంబేడ్కర్‌ని
బాగా చదివి ఆయన భావజాలాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానని పవన్
కొన్నిసార్లు అన్నారు. అన్ని కులాలకి ఒకటే న్యాయం అని అంబే డ్కర్, ఇతర
రాజ్యాంగ రూపకర్తలు అనుకోలేదు కనుక అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా ఎదుగుదల
లేని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని కులాలూ ఒకటి కానట్లే అన్ని మతాలు
కూడా ఒకటి కావు. ఎక్కడైనా మెజారిటీ మతాలు, మైనారిటీల హక్కులకి భంగం
కలిగించే సందర్భాలు ఉంటాయి కనుక సెక్యులరిస్టులు మైనారిటీ మతాల హక్కులకి
అండగా నిలబడతారు. దానర్థం పవన్ విరుచుకు పడినట్లు వారు ఆ యా మతాలకి
భయపడతారని, వలపక్షం చూపుతారని కాదు.
తిరుపతి సభలో వారాహి
డిక్లరేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటో ప్రజలమైన మాకు సరిగ్గా అర్థం
కావడం లేదు. డిప్యూటీ సీఎంగా లడ్డు నాణ్యత మీద రోజుల తరబడి పోరాడటం ముఖ్యమా
లేక కనీస అవసరాలు తీరని పేద ప్రజకోసం ఏవైనా చేయడం ముఖ్యమా అని అడగము,
మెల్లిగా తెలుగుదేశాన్ని పక్కకి జరిపి జనసేన, బీజేపీతో ఎటువంటి రాజకీయం
చేయబోతోంది అని కూడా అడగము, సరేనా! కానీ జస్ట్ ఆస్కింగ్! సనాతన ధర్మం
అంటే ఏమిటి? బోర్డులు గట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయబోతున్న
పోరాటపు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్పగలరా? వర్ణవ్యవస్థ ఇందులో
భాగమా, మనుధర్మ శాస్త్రం ఏమైనా పరిపాలనకి దిక్సూచి కానుందా? స్త్రీలను
ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవకులుగా, శ్రామిక కులాలను అంట రానివారిగా
నిశ్చయం చేయబోతున్నారా? ‘మతి ఎంతో గతి అంతే’ అన్నది మీకు ఇష్టమైన కొటేషన్.
ఇపుడు సనాతన హిందూగా మీ ‘మతి’ ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మా ‘గతి’ని ఎలా
మార్చబోతోందో తెలుసుకోవాలని జస్ట్ ఆస్కింగ్.
పవన్ కల్యాణ్
గారూ! ప్రసాదాలు, ప్రమాణాలు సంబంధిత శాఖలకి వదిలిపెట్టి పదేళ్ళ పైబడిన మీ
రాజకీయ ప్రయాణాన్ని సమీక్ష చేసుకోండి. మారిన వేషభాషలకి, మీరేంటో గర్జించి
ఇచ్చిన ప్రకటనకి మీరే జవాబుదారీ. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి
మీరు సాధారణ పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు
సెక్యులరిస్ట్‌గా వినపడటమే కాదు కనపడటం కూడా ప్రజాస్వామిక అవసరం.
ఇప్పటికీ
మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం
అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని
హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్య మంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు
రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు.
కె.ఎన్. మల్లీశ్వరి ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ ఏపీ కార్యదర్శి
Source: Sakshi
పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ…
మీరు పంచె ఎగ్గాట్టాల్సింది… గుడి మెట్ల పై కాదు…
విజయవాడ వరద బాధితుల కోసం!
మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది … నడి రోడ్డు పై కాదు….
వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం!
మీరు గొడవపడాల్సింది… మతాల కోసం కాదు…
నీట మునిగి… సాయమందని పేదల కోసం!
మీరు కడగాల్సింది… మెట్లను కాదు…
ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని…!
మీరు దీక్ష చేయాల్సింది … ప్రసాదాల కోసం కాదు…
రాష్ట్రం లో రాలి పోతున్న…ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాల కోసం!
మీరు ఉపవాసం ఉండాల్సింది… దేవుళ్ల కోసమే కాదు…
ఎక్కడ చూసినా.. ఆహారం కలుషితమై.. ఆసుపత్రి పాలౌతున్న… విద్యార్థుల కోసం!
మీరు బొట్లు పెట్టాల్సింది … గుడి మెట్లకు కాదు…
నాడు నేడు ని… కొనసాగించి… బాగుపరిచిన .. బడి మెట్లకు!
మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సింది… ఇప్పుడు ఏ లోటు లేని… సనాతనం కోసం కాదు…
మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాల కోసం!
మీరు ఆపసోపాలు పడాల్సింది… కొండెక్కడం కోసం కాదు…
రాష్ట్రం లో క్షీణిస్తున్న… శాంతి భద్రతలు అరికట్టడం కోసం!
మీరు సంప్రోక్షణ చేయాల్సింది… కల్తీ జరిగిందో లేదో తెలియని .. లడ్డూ కోసం కాదు
ప్రజలకు ఇసుకే దొరకకుండా చేసిన… కూటమి నాయకయుల అవినీతి ప్రక్షాళన కోసం!
మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు...
మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకులపైన..!
దేవుడు తమరికి పుట్టుకతో బుద్ది జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి
స్వామీ...
పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ…
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 8, 2024
మీరు పంచె ఎగ్గాట్టాల్సింది… గుడి మెట్ల పై కాదు…
విజయవాడ వరద బాధితుల కోసం!
మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది … నడి రోడ్డు పై కాదు….
వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం!
మీరు గొడవపడాల్సింది… మతాల కోసం కాదు…
నీట మునిగి… సాయమందని పేదల కోసం!… pic.twitter.com/EQ58xy1k0r
శాంతిభద్రతలను గాలికి వదిలేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వరుసగా వయస్సుతో నిమిత్తంలేడా
మహిళలపై దాడులు - చేతకాని ప్రభుత్వంలో మహిళలకి రక్షణ కరువైపోయింది. వరసగా జరిగిన ఘటనలు చూస్తే
2024 జూన్ 10:- అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో 13ఏళ్ళ మైనర్ బాలికపై అదే
గ్రామానికి చెందిన పరమట రాజశేఖర్ అనే వ్యక్తి అత్యాచారయత్నం.
2024 జూన్ 21:- బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం ఆపై హా
2024 జూన్ 26 :- పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఓప్పిచర్ల గ్రామంలో ఓంటరి మహిళ గండికోట విజయలక్ష్మీ పై
అత్యాచారం ఆపై హత్య
2024 జూన్ 27 :- విజయవాడలో ప్రేమోన్మాది టీడీపీ కార్యకర్త గడ్డం మణికంఠ దర్శిని అనే యువతిని ప్రేమపేరుతో
వేదించడమే కాకుండా అడ్డు చెప్పిన యువతి తండ్రీని హత్య చేశాడు.
2024 జూన్ 28 :- విజయవాడ మదరసాలో కరిపాలని చంపేసారని వారి తలి మోతుకున్నా స్పందనలేదు.
2024 జూన్ 30:- బాపట్ల పెరవలి గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై నిజాంపట్నం మండలం గరువపాలెం ద
అత్యాచారం.
2024 జులై 6 :- అనకాపల్లి రాంబిల్లి లో మైనర్ బాలికని ప్రేమపేరుతో వేదింది హత్య చేసిన ఉన్మాది
2024 జులై 7 :- మచ్చుమర్రిలో 8ఏళ్ళ చిన్నపాపపై అత్యాచారం ఆపై హత్య. మృతదేహం కూడా దోరకలేదు.
2024 జులై 7 :- ఏర్పేడు మూలకండ్రికలో 6ఏళ్ల బాలికపై అత్యాచారం
2024 జులై 14 :- విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జీలుగువలసలో ఆరునెలల చిన్నారిపై అత్యా
2024 జులై 15 :- పత్తిపాడులో 15ఏళ్ళ దళిత బాలికపై అత్యాచారం
2024 జులై 15 :- అనంతపురం - శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్కు వె
తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు
2024 జులై 16 :- గుంటూరు కొత్తరెడ్డిపాలానికి చెదందిన 8వ తరగతి విధ్యార్థినిపై అత్యాచారం ఆపై హత్య
2024 జులై 16 :- ఫిరంగిపురంలో నిలాంబరం అనే యువకుడి వేదిపులు తట్టుకోలేక పురుగులుమందు తాగి ఆత్మహత్య
చేసుకున్న బాలిక
2024 జులై 16 :- టి. నర్సాపురంలో 16ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం
2024 జులై 17: - దోరవారిసత్రంలో 8ఏళ్ళ బాలికపై అత్యాచారం ఆపై హత్య
2024 జులై 17:- విశాఖలో డిగ్రీ చదువుతున్న శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది సిద్దు.
నెలలోనే ఇన్ని ఘటనలు జరగడం ఎప్పుడు లేదు ...
ఆదరణ పొందిన "చాకిరేవు" కి తోడుగా
ఒక మిత్రుడి సూచనతో మొట్టికాయలు బ్లాగు మొదలెట్టాను.
https://mottikayalu.blogspot.com/2024/07/blog-post.html
ఈ బ్లాగుకి ట్రేడ్ మార్కు కూడా అప్లై చేయబోతున్నాను ..
The government provides a direct annual financial assistance of Rs.15,000/- to mothers whose children are studying from Class-I to Class XII, ensuring a 75% attendance duly processing the required validations for identifying the eligible BPL families.
మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు
మైనర్ బాలుర విచ్చలవిడి తనాలు..
మానవ సంబంధాలు ఆందోళన కలిగిస్తున్న క్రమంలో
తక్షణం 6 వ తరగతి నుంచి ఒక సబ్జెక్ట్ క్రొత్తగా ప్రవేశ పెట్టాలి
దానిలో మానవ సంబంధాలు , స్త్రీలనుగౌరవించడం , తల్లి దండ్రుల మీద ప్రేమ , దీన జనులపై ఆప్యాయత లాంటి పాఠాలు ఉండాలి ..
ఇది అన్ని ప్రభుత్వాలూ తక్షణం చేయాలి
ఈరోజు అదే బాటలో నడుస్తున్న టిడిపి నాయకులు తెలుసుకోవాలి
ఇదేనా ఆంధ్రా సంస్కృతి ..
తెలుగుదేశం అని పేరు పెట్టుకున్న మీరు "తెలుగువారి గౌరవం" పెంచండి
అధికారంలోకి వచ్చిన నెల రోజులకే కళ్ళు నెత్తికి ఎక్కి ప్రవర్తిస్తున్న టిడీపీ నాయకులను జనాలు ఛీ అంటున్నారు అని తెలుసా ..నిన్న పై టపా చూసా ..
నిజానికి నేను ఎన్నికలకు చాలా రోజుల ముందే పోస్టులు పెట్టడం ఆపేశాను
వ్యక్తిగత కారణాలకు తోడు ఎన్నికల హడావిడిలో అందరూ ఉన్నారు కదా ఎవరు గెలిస్తే నాకు ఏమిటి .. చూద్దాం ప్రజల నాడి ఎలా ఉందో అని గమ్మున కూర్చున్నా
నేను జగన్ అభిమానిని అని బ్రమించే వాళ్ళు క్రింది పోస్టులు చూడండి
ఇప్పుడు నాకు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం వచ్చింది ..
నాకు ప్రతిపక్ష పాత్ర అంటే ఎక్కువ ఇష్టం ..
రాబోయే ఐదు సంవత్సరాలూ చాకిరేవు 3.0 చూడడానికి రెడీనా ..
రవి ప్రకాష్ అనే బ్రోకర్ తో పీకే తో గంటల తరబడి చర్చ
వందలాది కోట్లు తీసుకుని
హైదరాబాద్ టిడిపి ట్రస్ట్ ఆఫీస్ లో వందలమంది సిబ్బందితో టిడిపి గెలుపు కోసం కృషి చేస్తూ ..
వైసీపీ ఒడిపోతుంది అని విశ్లేషిస్తూ
అబడ్డాలు చెపుతూ ..
ఏమి పీకేది లేక ఉన్న పరువు పోగొట్టు కుంటున్న పీకే
టిడిపి అధికారంలోకి వస్తే 31 లక్షల ఇళ్ల పట్టాలు రద్దు అవుతాయి అని ఆ పార్టీలో నాయకులు గట్టిగా చెప్పారు.
తాము అధికారంలోకి ఆస్తే జగనన్న కాలనీ ఇళ్ల స్తలాల కుంభకోణంపై విచారణ జరుపుతాం అని చెప్పారు
చంద్రబాబు ఆడియో కాల్ ఒకటి లీక్ అయింది .. దానిలో తాను పథకాలు ఇచ్చేదీ లేదు అని అమరావతి తన ఎజెండా అని చెప్పారు
ల్యాండ్ టైటిలింగ్ ఏక్ట్ లో జగన్ ఆస్తులు లాగేసుకుంటాడట..
అప్పుడు ఈ తింగరి ప్రతిపక్షాలు మూసుకుని హైదరాబాద్ లో షూటింగులు చేసుకుంటాయా
ప్రజల పక్షం ఉండడం తెలీదా ..
అబద్దాలతో ప్రచారం .. అధికారం కోసం అడ్డదారులు
పేదలకు , బలహీన వర్గాలకు, అవ్వా తాత లకు ఈ ఎన్నికలు ఒక పెద్ద పరీక్ష..
ఈ ఎన్నికలలో జగన్ ఒడిపోతే .
.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో
సీటు జనసేనకు ఇచ్చినట్లే ఇస్తాడు ..
తీరా వాళ్ళు సీటు ప్రకటించాక టిడిపి వాళ్ళతో ఆందోళనలు చేయిస్తాడు
చివరికి ఆ సీటు వాళ్ళకే తిరిగి ఇచ్చేయడం
అవనిగడ్డ .. తిరుపతి .. ఇంకా ఎన్ని చోటుల్లోనో
చంద్రం బాబా మహిమ ..
జగన్ గాలిలో వైసీపీలో నెగ్గినా తన పలుకుబడి వల్ల గెలిచానని గొప్పలు
పచ్చ మీడియాకు బహు ప్రచారం చేసి రేటింగులు పెంచారు
బిజెపిలో తాను చక్రం తిప్పగలను అని గొప్పలు
ఏపార్టీలో లేని మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మీ పరువు నిలబెట్టుకోండి
మీరు ఎంత గొప్పవారో జనానికి .. మిమ్మల్ని ఛీ అంటున్న ఈ పార్టీలకు చాటండి
జై రఘురామ .. విగ్గు గుర్తుకే మా ఓటు
కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న అందరు కమ్మవారికి కమ్మ సంఘాలు ఒక పెద్ద హెచ్చరిక జారీ చేశాయి. అన్ని కమ్మ కుటుంబాలూ తమ వారు ఏ పార్టీల్లో ఉన్నా అత్యవసరంగా టిడిపి లో చేరాలి అని ఒత్తిడి చేయాలి అని చెప్పాయి. ఈనాడు , ఏబీఎన్ అధినేతల ద్వారా లాబీయింగ్ చేయించి అనేక నాయకులను, మాజీ అధికారులనూ తప్పకుండా ఈసారికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అని ఇది జీవన్మరణ సమస్య అని చెప్పాయి .
ఇటీవల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తనపై కుటుంబం ఒత్తిడి ఉంది అని అందుకే పార్టీ మారుతున్నాను అని చెప్పారు.
అలాగే జయ ప్రకాష్ నారాయణపై ఒత్తిడి వచ్చి ఉండవచ్చు
లేకపోతే ..
నిన్న మొన్నటి దాకా జగన్ ని పొగిడి ఇప్పుడు జగన్ కు ఓటు వేయొద్దు ఆనడు కదా !
నిన్న మొన్నటి దాకా అధికార వికేంద్రీకరణ మంచిది అన్నవాడు ఇప్పుడు నిర్మితమే కాని అమరావతికి జై కొట్టడు కదా!
లాజిక్ లేని ప్రసంగంతో తన పరువు తానే తీసుకున్నాడు జెపి!!